Nalgonda: దండుమల్కాపురంలో ఓ డీసీఎంలో చెలరేగిన మంటలు..!

* హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పార్సిల్స్‌తో వెళ్తుండగా ప్రమాదం.. షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అనుమానం

R Tripura Malini
Published on: 8 Nov 2022 10:27 AM IST
A fire broke out in a DCM in Dandumalkapuram
X

దండుమల్కాపురంలో ఓ డీసీఎంలో చెలరేగిన మంటలు

Dandumalkapuram: నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. దండుమల్కాపురంలో ఓ డీసీఎంలో మంటలు చెలరేగాయి. మంటలు గ్రహించిన డ్రైవర్ డీసీఎం నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఆన్‌లైన్‌ పార్సిల్స్‌తో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు కోటి రూపాయల ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేశారు. షార్ట్‌ సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story