logo
తెలంగాణ

Siddipet: రాయపోల్‌ మండలం ఎల్కల్‌ గ్రామంలో రైతు ఆత్మహత్య

A Farmer Commits Self Distraction in  Siddipet District
X

Representational image

Highlights

Siddipet: సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్‌ మండలం ఎల్కల్‌ గ్రామంలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Siddipet: సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని రాయపోల్‌ మండలం ఎల్కల్‌ గ్రామంలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెట్టుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో భూమయ్య వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని భూమయ్య ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నడని, అప్పులు తీర్చే మార్గం కనపడక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. భూమయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Web TitleA Farmer Commits Self Distraction in Siddipet District
Next Story