రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో కారులో మృతదేహం

A Dead Body in a Car in Puppalguda of Rangareddy District
x

రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడలో కారులో మృతదేహం

Highlights

Rangareddy: మారుతి వ్యాన్‌లో మృతదేహం గుర్తించిన స్థానికులు

Rangareddy: రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం నార్సింగ్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని పుప్పాల్‌గూడలో ఓ కారులో మృతదేహం కలకలం రేపింది. నిలిపి ఉంచిన ఉన్న ఓ మారుతి కారులో మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

అయితే డ్రైవర్ సీటు వెనుక మృతదేహం ఉంది. దీంతో హత్యా లేదా ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ వ్యక్తి ఎవరనే దానిపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కారు నెంబర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories