వరుడు..వధువు..మధ్యలో ప్రియుడు!

వరుడు..వధువు..మధ్యలో ప్రియుడు!
x
Highlights

ఒకరిని ప్రేమించి, పెద్దలు బాధపడతారని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి ఒప్పుకుని, పెళ్లి మండపంలో కూర్చుని, తీరా సుముహూర్తం రాగానే పెళ్లిని ఆపి ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయే సన్నివేశాలు సినిమాల్లో చాలానే చూసుంటాం.

ఒకరిని ప్రేమించి, పెద్దలు బాధపడతారని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడానికి ఒప్పుకుని, పెళ్లి మండపంలో కూర్చుని, తీరా సుముహూర్తం రాగానే పెళ్లిని ఆపి ప్రియుడి దగ్గరికి వెళ్లిపోయే సన్నివేశాలు సినిమాల్లో చాలానే చూసుంటాం. మరి అలాంటి సంఘటనే నిజజీవితంలో జరిగితే ఎలా ఉంటుంది. ఆలోచిస్తేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదూ. సరిగ్గా ఇలాంటి సన్నివేశమే కనగల్‌ మండలంలో చోటు చేసుకుంది. కుదిర్చిన పెళ్లి జరిగిపోయి సిరగ్గా ఒడి బియ్యం పోసి అత్తారింటికి సాగనంపే సమయంలో పందిట్లో వధువు ప్రియుడు కనిపించాడు. దీంతో దుఖం ఆపుకోలేని వధువు ప్రియుడి దగ్గరికి వెళ్లి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, 'నువ్వే కావాలి' అంటూ పెళ్లి కూతురు భోరున విలపించింది. దీంతో అక్కడికి వచ్చి బంధువులు, వరుడు, వరుని కుటుంబ సభ్యులు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానిని గురయ్యారు. వెంటనే వరుడు తరుఫు బంధువులు ఇందేంటి అని ప్రశ్నించగా పెళ్లి కూతురు తెగదెంపులు చేసుకుని వెళ్లిపోయింది. పెద్దలందరినీ ఒప్పించి శనివారం ప్రియుడిని మళ్లీ పెళ్లి చేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించిన పూర్తివివరాల్లోకెళితే కనగల్‌ మండలం కురంపల్లి గ్రామంలో పద్మ, ఆమె కుమార్తె జీవనం సాగిస్తున్నారు. కాగా ఈ మధ్య కాలంలోనే మౌనికకు హైదరాబాద్‌ నుంచి ఓ మంచి సంబంధం కుదిరింది. దీంతో మౌనిక తల్లి పద్మ తన స్థోమతలో వివాహాన్ని జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. పెళ్లి ముహుర్తం రానే వచ్చేసింది. దీంతో శుక్రవారం పెళ్లి జరిపించారు. అప్పటి వరకు అంతా సక్రమంగానే సాగింది. పెళ్లి కూతురికి ఒడి బియ్యం పోసి సరిగ్గా సాగనంపే సమయంలో మౌనికకు మామ అయిన దేవరకొండ మండలం గోనబోయినపల్లికి చెందిన రాజు (తన ప్రియుడు) పెళ్లి మండపానికి చేరుకున్నాడు. అతన్ని చూసిన వధువు వెంటనే అతని దగ్గరికి చేరుకుని నువ్వే కావాలంటూ కన్నీటి పర్యంతమైంది. దీంతో వరుడి కుటుంబ సభ్యులు, బంధువులు నివ్వెరపోయారు. ఆ తరువాత వధుకు కుటుంబీకులు వరుడి కుటుంబీకులతో తెగదంపులు చేసుకుని మౌనిక ప్రియుడికి ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నారు. వరుడి కుటుంబ సభ్యులతో తెగదెంపులు చేసుకుని శనివారం దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ గుడి వద్ద కోరుకున్నవాడితో మౌనిక వివాహం జరిపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories