Top
logo

9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి : పరారిలో నిందితుడు

girl
X
Representational Image
Highlights

సమాజంలో రోజు రోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతుంది. న్యాయ వ్యవస్థలో ఆడపిల్లలని రక్షించేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా వారికి మాత్రం రక్షణ కరువయింది.

సమాజంలో రోజు రోజుకు నేరాల సంఖ్య పెరిగిపోతుంది. ఆడపిల్లలకు రక్షణ కరువైంది. న్యాయ వ్యవస్థలో ఆడపిల్లలని రక్షించేందుకు ఎన్ని చట్టాలు వచ్చినా వారికి మాత్రం రక్షణ కరువయింది. అదే కోణంలో జోగులంబ-గద్వాల్ జిల్లా మాల్దకల్ మండలంలో శనివారం తొమ్మిదేళ్ల బాలికపై నరేష్ (25) అనే వ్యక్తి బాలికను వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను తన ఇంటి దగ్గర వదిలి పారిపోయాడు.

దీంతో ఆ బాలికకు ఆ రోజు రాత్రి తీవ్ర కడుపు నొప్పి రావడంతో జరిగిన విషయం తన అమ్మమ్మకు తెలియజేసింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో ఈ సంఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారి వున్న నిందితుని కోసం గాలిస్తున్నారు. నరేష్‌పై నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపారు.


Next Story