మేడ్చల్‌ జిల్లా కీసరలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

Medchal: అరెస్టయినవారిలో టీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్ల భర్తలు...

Shireesha
Published on: 19 Dec 2021 1:24 PM IST
7 Members Arrested in Poker Case Today in Medchal | Telangana News Today
X

మేడ్చల్‌ జిల్లా కీసరలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్ట్

Medchal: మేడ్చల్‌ జిల్లా కీసరలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఓ రిసార్ట్‌లో పేకాట ఆడుతున్న ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. అరెస్టయినవారిలో టీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్ల భర్తలు ఉన్నారు.

జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌ 3వ డివిజన్‌ భర్త బల్లి శ్రీనివాస్‌తో పాటు 4వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త మరగొని వెంకటేష్‌, 9వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త మనోదర్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 65 వేల 610 రూపాయల నగదుతో పాటు.. 5 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 3, 4, 5 ఆఫ్‌ టీఎస్‌ గేమింగ్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Shireesha

Shireesha

Next Story