తెలంగాణలో కొత్తగా 66 కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 66 కేసులు నమోదు
x
Representational Image
Highlights

తెలంగాణలో కరోనా వైర‌స్ ద‌డ‌పుట్టిస్తుంది. ఈ మహమ్మరి రోజురోజుకు పెరుగుతూ ప్రజ‌ల‌ను వ‌ణికిస్తుంది. తాజాగా ఇవాళ ఒక్క రోజే 66 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

తెలంగాణలో కరోనా వైర‌స్ ద‌డ‌పుట్టిస్తుంది. ఈ మహమ్మరి రోజురోజుకు పెరుగుతూ ప్రజ‌ల‌ను వ‌ణికిస్తుంది. తాజాగా ఇవాళ ఒక్క రోజే 66 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్ విడుద‌ల చేసింది. ఇప్పటి వ‌ర‌కు 700 కేసులు ఉండ‌గా.. తాజాగా పెరిగిన కొత్త కేసుల‌తో 766కు చేరాయి. ఈ రోజు ఎవ‌రు డిశ్చారి కాలేదు. గురువారం వ‌ర‌కు డిశార్జ్ అయిన‌వారి సంఖ్య 187 వ‌ర‌కు ఉంది. 18మంది మ‌ర‌ణించారు. రెండు రోజుల్లో 116 కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు నమోదైన మొత్తం కేసుల్లో అత్యధికంగా 30 హైదరాబాద్‌లోనే కావడం ఆందోళన కలిగిస్తుంది.

సూర్యాపేట జిల్లాలో ఈనెల 2వతేదీ ఒక కేసు న‌మోదైంది. 17వ తేదీ నాటికి 15 కోవిడ్ 19పాజిటివ్ కేసులు ఉన్నాయి. సూర్యాపేట‌లో కూర‌గాయ‌ల మార్కెట్లో ఏడు, బీబీగుడేంలో రెండు, కోదాడ‌లో ఒక పాజిటివ్ కేసు న‌మోదైన‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఈ రోజు ఒక్క‌రోజు 10పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మైయ్యారు. తొలిసారి గ‌ద్వాల‌లో ఒక కేసు న‌మోదైంది.

రాజ‌ధాని హైద‌రాబాద్ ప‌రిథిలో ఇవాళ ఒక్కరోజు 30మందికి క‌రోనా పాజిటివ్ నిర్థార‌ణ అయింది. ఈమేర‌కు జీ హెచ్ ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేశ్ కుమార్ వెల్ల‌డించారు. క‌రోనా సోకిన వారితో కాంటాక్డ్ అయిన వారికి కూడా ప‌రీక్షలు నిర్వహించిన‌ట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories