Corona: సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో కరోనా కలకలం

* మహాత్మ జ్యోతిరావు పూలే కాలేజీలో విద్యార్థులకు కరోనా * 42 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడికి పాజిటివ్

Shilpa
Published on: 29 Nov 2021 12:56 PM IST
42 Students Affected Corona in Jyotirao Phule College in Sangareddy
X

సంగారెడ్డి జిల్లా ముత్తంగిలో కరోనా కలకలం(ఫైల్ ఫోటో)

Corona: సంగారెడ్డి జిల్లా ముత్తంగి మహాత్మ జ్యోతిరావు పూలే కాలేజీలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయుడు కరోనా బారిన పడ్డారు. ఈ కాలేజీలో ఇంటర్మీడియట్, టెన్త్‌ కలిపి మొత్తం 520 మంది విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు. వైరస్‌ బారిన పడిన వారికి కాలేజీలోనే ఐసోలేషన్‌ ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు. ఇవాళ కోవిడ్‌ టెస్టులు చేయనున్నారు అధికారులు.

కరోనా బారిన పడిన విద్యార్థుల శాంపిల్స్‌ను వైద్యాధికారులు జీనోమ్‌ స్వీక్వెన్సింగ్‌కు పంపారు. ఇక బాధిత విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యారోగ్యశాఖ తెలిపింది. మూడ్రోజుల క్రితం ఓ విద్యార్థిని అస్వస్థతకు గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌ నిర్ధరణ అయింది. దీంతో నిన్న విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 43 మందికి పాజిటివ్‌గా తేలింది.

Shilpa

Shilpa

Next Story