ప్రతి రైతుకు 4 లక్షల రుణమివ్వండి : కేంద్ర ఆర్థికమంత్రికి రాష్ట్ర రుణ విముక్తి కమిషన్‌ చైర్మన్‌ లేఖ

ప్రతి రైతుకు 4 లక్షల రుణమివ్వండి : కేంద్ర ఆర్థికమంత్రికి రాష్ట్ర రుణ విముక్తి కమిషన్‌ చైర్మన్‌ లేఖ
x
Highlights

దేశానికి అన్నం పెట్టే రైతులు ఎన్నో కారణాలతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆ ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక బలవంతంగా తమ ప్రాణాలను తీసుకుంటున్నారు.

దేశానికి అన్నం పెట్టే రైతులు ఎన్నో కారణాలతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆ ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక బలవంతంగా తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. అయితే ఇలాంటి ఇబ్బందుల నుంచి రైతులు బయటపడేందుకు ఓ ఆలోచన చేసింది. ప్రతి రైతుకు దీర్ఘకాలిక, పంట రుణాల కింద ఒక్కొక్కరికీ రూ.4 లక్షలు మంజూరుచేయాలని నిర్ణయించుకుంది. దీనికోసం రాష్ట్ర రుణ విముక్తి కమిషన్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. రైతులు పంటలు వేయడానికి డబ్బులు లేక పోవడంతో ప్రైవేట్‌ వ్యక్తుల దగ్గర అప్పు లు తీసుకొని వారికి భారీగా వడ్డీలు చెల్లిస్తున్నారని, దాంతో వారు ఆర్థకంగా వెనకబడిపోతున్నారని లేఖలో పేర్కొన్నారు.

అవసరం నిమిత్తం రైతులు ప్రయివేటు వ్యక్తుల వద్ద రూ.లక్ష అప్పుగా తీసుకొంటే వారు ఏడాదికి రూ.36 వేల వరకు వడ్డీ చెల్లిస్తున్నారని చెప్పారు. అదే రైతులకు బ్యాంకులే రుణాలను మంజూరు చేస్తే వారు కేవలం రూ.11 వేలు మాత్రమే వడ్డీ కింద చెల్లించాల్సి వచ్చేదని తెలిపారు. దీంతో వారికి కాస్త వెసలు బాటు ఉండేదన్నారు. అందుకోసమే ప్రభుత్వమే రైతులకు దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో రైతులకు రుణాల రూపంలో రూ.2 లక్షల కోట్లను అందించాలని నిర్ణయించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మొత్తం రైతుకు నేరుగా చేరేందుకు దీర్ఘకాలిక, పంట రుణాలను అందించాలని కోరారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories