Top
logo

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో పట్టుబడిన నగదు ఎంతో తెలిస్తే..

లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణలో పట్టుబడిన నగదు ఎంతో తెలిస్తే..
Highlights

మరో మూడ్రోజుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఏప్రిల్‌ 11న (గురువారం) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో...

మరో మూడ్రోజుల్లో లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఏప్రిల్‌ 11న (గురువారం) ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నియమావళి ప్రకారం.. మంగళవారం సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగియనుంది. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదునుపెడుతున్నారు.డబ్బు, మద్యంతో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. సాధ్యమైనంతమేరకు వీటిని అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ తీవ్ర కృషి చేస్తోంది.

పగటిపూట హోరాహోరీగా ఎన్నికల ప్రచార సభలు, రోడ్డుషోలు, ర్యాలీలు నిర్వహిస్తు రాత్రివేళల్లో డబ్బుతో ఓటర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారు. కోడ్‌ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో శనివారం నాటికి రూ.41.04 కోట్ల నగదు పట్టుబడగా, అందులో దాదాపు రూ.20 కోట్లు గడిచిన మూడ్రోజుల్లోనే పట్టుబడగా. ఊరూవాడా మద్యం ఏరులై పారుతోంది. ఇప్పటి వరకు రూ.3.85 కోట్లు విలువ చేసే 2.82 లక్షల లీటర్ల మద్యం పట్టుబడింది.

Next Story