logo

1,095 ఓట్లకు.. 27 ఓట్లు పోల్‌

1,095 ఓట్లకు.. 27 ఓట్లు పోల్‌

లోక్ సభ ఎన్నికల సందర్బంగా తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. పెద్దపల్లికి సమీపంలోని బందంపల్లి గ్రామంలో 1,095 మంది ఓటర్లుండగా కేవలం 27 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని మెజార్టీ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామపంచాయతీగా ఉన్న తమ గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో అన్యాయంగా విలీనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో కలపడం ద్వారా ఉపాధిహామీ పథకం దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చాలా మంది ఎన్నికల బహిష్కరణ చేయడంతో పాటు నిరసన వ్యక్తం చేశారు.

లైవ్ టీవి

Share it
Top