తెలంగాణలో కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు

X
Highlights
తెలంగాణలో కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Samba Siva Rao4 Jan 2021 4:28 AM GMT
తెలంగాణలో కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసుల్లో గ్రేటర్ పరిధిలో 60 కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 27,077 పరీక్షలు నిర్వహించగా.. మొత్తం కేసులు సంఖ్య 2,87,740కి చేరింది. మరోవైపు కొవిడ్‌తో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మరణించగా.. ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1551కి చేరింది. మరోవైపు తాజాగా 518 మంది కరోనాను జయించగా.. ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 2,81,083కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,106 క్రియాశీల కేసులు ఉండగా.. వీరిలో 2,942 మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు.
Web Title238 Corona Positive Cases In Telangana
Next Story