సూర్యాపేటలో కరోనా కలకలం : ఒకే కుటుంబంలో 22మందికి..

సూర్యాపేటలో కరోనా కలకలం : ఒకే కుటుంబంలో 22మందికి..
x
Highlights

* హోంక్వారంటైన్‌లోకి కరోనా బాధితులు * ఇటీవల ఓ ఇంట్లో అంత్యక్రియలకు హాజరైన కరోనా బాధితులు * సూర్యాపేటలో ఆరోగ్య సర్వే చేపట్టిన వైద్యారోగ్యశాఖ

సూర్యాపేటలో కరోనా వైరస్ కలవరం సృష్టించింది. పట్టణంలోని గేటెడ్ కమ్యూనిటి కాలనీలోని ఒకే కుటుంబానికి చెందిన 22 మందికి కరోనా వైరస్ సోకింది. వీరంతా ఇటీవల ఓ ఇంట్లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా కాలనీలో వైద్య ఆరోగ్య శాఖ సర్వే చేపట్టింది. ప్రస్తుతం వైరస్ బాధితులంతా హోంక్వారైంటన్ లో ఉన్నారు. అయితే ఎవరికీ పెద్దగా లక్షణాలు కనిపించలేదని.. పరీక్షలు చేయించుకుంటేనే పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్నారు. ఒకే కుటుంబంలో 22 మందికి కరోనా సోకడంతో గతంలో వారంతా ఎవరెవరిని కలిశారు అనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై వైద్యఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. గత ఏప్రిల్‌లో సూర్యాపేటలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదైన విషయం తెలిసిందే.


Show Full Article
Print Article
Next Story
More Stories