CAG Report: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

2022-2023 CAG Report In Telangana Assembly
x

CAG Report: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

Highlights

CAG Report: తెలంగాణ అసెంబ్లీలో సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

CAG Report: తెలంగాణ అసెంబ్లీలో సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించిన కాగ్ రిపోర్టును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కాగ్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు చేశారన్నారు. 1983 నుంచి 2018 మధ్య కాలంలో 20 సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం అయితే... లక్షా 73 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం లక్ష కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇచ్చిన రుణాల అడ్వాన్సులు భారీగా ఉన్నాయని కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథకే ఎక్కువ రుణాలు తీసుకున్నారని రిపోర్ట్‌లో కాగ్ వెల్లడించింది.

కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్లీ చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. బడ్జెటేతర రుణాలను తిరిగి చెల్లించేందుకు సైతం ఇబ్బంది తప్పదని తెలిపింది. 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా గత ప్రభుత్వం 6 శాతం రుణాలు ఎక్కువ తీసుకందని పేర్కొంది. గత సంవత్సర బడ్జెట్‌లో పన్నుయేతర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారని పేర్కొంది. ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58 శాతం, ఎస్టీ నిధుల్లో 38 శాతం వినియోగించలేదని తెలిపింది. ఖర్చు అయిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను సైతం గత సర్కార్ దారిమళ్లించినట్లు రిపోర్టులో పొందుపర్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories