జనగామ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు

14 Women Trapped Between Two Rivers
x

జనగామ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు

Highlights

*రెండు వాగుల మధ్య చిక్కుకున్న 14 మంది మహిళా కూలీలు

Jangaon: జనగామ జిల్లాలో చీటూరు గ్రామానికి చెందిన 14 మంది మహిళా కూలీలు రెండు వాగుల మధ్య చిక్కుకున్నారు. చిమ్మని చీకట్లో, ఎడతెరపి లేని వాగులు ఎటు వెళ్లలేని పరిస్థితిలో స్మశానవాటికలో తలదాచుకున్నారు. చీటూరు గ్రామానికి చెందిన 14 మంది కూలీలు పక్క గ్రామానికి నాటు వేసేందుకు వెళ్లారు. పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా చీటూరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. తిరిగి కన్నాయపల్లికి వెళ్తుంటే గోపువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండు వాగుల మధ్య మహిళా కూలీలు చిక్కుకుపోయారు. భారీగా వర్షం పడడంతో ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ స్మశానవాటికలో తలదాచుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories