Nirmal: పటిష్ఠ ప్రజాస్వామ్యానికి ఓటరే కీలకం: కలెక్టర్ ఎం.ప్రశాంతి

Nirmal: పటిష్ఠ ప్రజాస్వామ్యానికి ఓటరే కీలకం: కలెక్టర్ ఎం.ప్రశాంతి
x
Highlights

జిల్లా కేంద్రంలో 10 వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమ ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు.

నిర్మల్: జిల్లా కేంద్రంలో 10 వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమ ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణ నుండి ఆమె ర్యాలీలో నడిచారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ... నూతన ఓటర్ల నమోదుకై యువ ఓటరు కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు . పాఠశాలలో విద్యార్థుల ఓటర్ల కోసం ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అర్హత ఉన్న 18 సంవత్సరాలు దాటిన యువత, తప్పకుండా వారి పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు.

కలెక్టరేట్ చౌరస్తాలో ఓటర్ల ప్రతిజ్ఞలో ఆమె పాల్గొన్నారు. తర్వాత యమ్ఎస్ ఫంక్షన్ హాల్లో జరిగిన సభలో డిఆర్ఓ సోమేశ్ కుమార్, డిఈఓ టామ్నే ప్రణీత, తహసీల్ధార్ సుభాశ్ లు మాట్లాడారు. సీనియర్ సిటిజన్ లు పి.నర్సమ్మ, జె.నారాయణ, జి .భూమన్న, ఏ .పోసాని, ముత్తన్నలను శాలువా పూలమాలతో సన్మానించారు. బియల్ఓ బి .శోభా, ఆర్బి వనిత, ఐకెపిఎల్ రాధాలను సన్మానించా.రు .వ్యాసరచన, ఉపన్యాసం జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ ఏఓ కరీం, జిల్లా సైన్స్ అధికారి వినోద్ కుమార్, ప్రముఖ వ్యాఖ్యాత, కవి బి .వెంకట్, ఆర్ఐ యల్. ప్రశాంత్ , డిటి .హన్మాండ్లు, విఆర్ఓలు గణపతి రెడ్డి, చిన్నా రెడ్డి, రమేష్, శ్రీదేవి, యువకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories