తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె.... డిపోలకే పరిమితమైన బస్సులు

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె.... డిపోలకే పరిమితమైన బస్సులు
x
Highlights

-తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె -డిపోల ముందు కార్మిక సంఘాల ఆందోళనలు -డిపోలకే పరిమితమైన బస్సులు -తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు -ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం -7వేల బస్సులు సిద్ధం చేసిన అధికారులు -డిపోల వద్ద 144సెక్షన్ అమలు

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె కొనసాగుతోంది. కార్మికులు విధులను బహిష్కరించారు. సమ్మెలో 57వేల మంది కార్మికులు పాల్గొంటున్నారు. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఒక్క బస్సు కూడా డిపో నుంచి బయటికిరావడం లేదు. డిపోల ముందు జేఏసీ నేతలు ఆందోళనకు దిగుతున్నారు. కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. జేబీఎస్, ఎంజీబీఎస్‌‌లలో ఒక్క బస్సు లేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.

కార్మికుల సమ్మె ప్రభావం దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారి మీద పడకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు 7వేల ప్రైవేటు వాహనాలు సిద్ధం చేశారు. ప్రైవేటు వాహనాలను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. డిపోల వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని డిపోల దగ్గర 144 సెక్షన్ విధించి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోల్లో 4,153 మంది కార్మికులు విధుల్లో చేరకుండా ధర్నాకు దిగారు. ఖమ్మం జిల్లాలో పోలీసు భద్రతతో ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. డిపోల దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు డిపోల్లోని ఆర్టీసీ కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోల పరిధిలోని 2500 మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories