Tsrtc Strike ; హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు సర్కార్‌ విముఖత

Tsrtc Strike ;  హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు సర్కార్‌ విముఖత
x
Highlights

బుధవారం సర్కార్ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుకు విముఖత తెలిపింది.

టీఎస్ఆర్టీసీ కార్మికుల సమ్మె విచారించిన హైకోర్టు సమస్య పరిష్కారానికి ముగ్గురు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని పేర్కొంది. ఈ విషయమై ప్రభుత్వం అభిప్రాయం బుధవారంలోగా చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశించిన సంగతి తెలిసిందే. కమిటీ ఏర్పాటుకు ఆర్టీసీ కార్మికుల జేఏసీ కూడా స్వాగతించింది. ఈ అంశంపై బుధవారం సర్కార్ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుకు అభ్యంతరం తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె లేబర్ కోర్టు పరిధిలో ఉంటుందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. 1947 పారిశ్రామిక వివాదాల పరిష్కార చట్టాన్ని ఆర్టీసీ కార్మీకులు ఉల్లంఘిస్తున్నారని, ఇండిస్టీయల్ డిప్యూట్ యాక్ట్ ప్రకారం కార్మికులంతా కంపెనీల నిబంధనలకు లోబడి పనిచేయాలని అఫిడవిట్‌లో పేర్కొంది. పారిశ్రామిక వివాదాల పరిష్కార యాక్ట్‌ సెక్షన్‌ 10 ప్రకారం కార్మికులు సమ్మె విషయంలో లేబర్ కమిషన్‌కు ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర సర్కార్ కోర్టును కోరింది.

మంగళవారం కోర్టులో ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్దమని ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమ్మె చట్ట విరుద్ధం అని ఆదేశించడానికి కోర్టుకు ఉన్న పరిధి, అధికారాల గురించి సీనియర్‌ న్యాయవాది విద్యాసాగర్‌ తన వాదనలు విన్పించారు. గతంలో ఏపీఆర్టీసీ ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించారు.కాబట్టి ఇప్పుడు టీఎస్‌‌ఆర్టీసీ ఉద్యోగులపై కూడా ఎస్మా ప్రయోగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీని 1998, 2015 సంవత్సరంలో ఎస్మా కింద పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని నిన్న కోర్టు దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories