Xiaomi: షావోమి 10 ఏళ్ల పండగ సందర్భంగా.. మార్కెట్లోకి లాంచ్‌ అయిన ప్రొడక్ట్స్‌ ఇవే.

Xiaomi launches 5 new devices in India as part of its 10 year anniversary: Redmi 13 and more
x

Xiaomi: షావోమి 10 ఏళ్ల పండగ సందర్భంగా.. మార్కెట్లోకి లాంచ్‌ అయిన ప్రొడక్ట్స్‌ ఇవే. 

Highlights

Xiaomi: షావోమి 10 ఏళ్ల పండగ సందర్భంగా.. మార్కెట్లోకి లాంచ్‌ అయిన ప్రొడక్ట్స్‌ ఇవే.

Xiaomi: షావోమీ ఈ బ్రాండ్‌ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చైనాకు చెందిన ఈ ఎలక్ట్రానిక్‌ దిగ్గజానికి భారత్‌లోనూ విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఈ బ్రాండ్‌ నుంచి వచ్చే ప్రొడక్ట్స్‌ కోసం టెక్‌ లవర్స్‌ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. మరీ ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని తీసుకొచ్చే ప్రొడక్ట్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కాగా పేరుకు చైనా కంపెనీ అయినా షావోమీ భారత్‌లోనూ తన సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

షావోమీ గత కొన్నేళ్లుగా మేడ్ ఇన్‌ ఇండియా నేపథ్యంగా తన ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. షావో ఇండియాలో తన సంస్థను ప్రారంభించి పదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని భారత్‌లో షావోమి తాజాగా కొన్ని కొత్త ప్రొడక్ట్స్‌ను లాంచ్‌ చేసింది. ఇంతకీ ఏంటా ప్రొడక్ట్స్‌.? వాటి ఫీచర్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* షావోమీ పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో రెడ్‌మీ13 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ12 5జీకి కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్‌ ధరలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. కంపెనీ ఈ ఫోన్‌ను రూ. 12,999గా నిర్ణయించింది. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.79 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 4 జెన్‌ 2 ఏఈ ప్రసెసర్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5030 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

* షావోమీ తీసుకొచ్చిన మరో ప్రొడక్ట్‌ రెడ్‌మీ బడ్స్‌ 5సీ ఒకటి. ఈ ఇయర్‌ బడ్స్‌ ధరను రూ. 1,999గా నిర్ణయించారు. ఫీచర్ల విషయానికొస్తే 40డీబీ యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌తో పనిచేస్తుంది. అలాగే ఇందులో టచ్‌ కంట్రోల్‌ను ప్రత్యేకంగా ఇస్తున్నారు. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 7 గంటలపాటు ఉపయోగించుకోవచ్చు. ఏఐ ఈఎన్సీ వటి ఫీచర్‌ ఈ ఇయర్ బడ్ సొంతం.

* షావోమి పవర్‌ బ్యాంక్‌ను సైతం లాంచ్‌ చేసింది. 2వే ఛార్జింగ్ సదుపాయంతో దీనిని తీసుకొచ్చారు. 10,000 ఎమ్‌ఏహెచ్‌ కెసాసిటీ ఈ వవర్‌ బ్యాంక్‌ సొంతం. టైప్‌ సి కేబుల్‌తో ఈ పవర్‌ బ్యాంక్‌ పనిచేస్తుంది. రెండు పవర్‌ బ్యాంక్‌లను తీసుకొచ్చారు. వీటిలో పాకెట్‌ పవర్‌ బ్యాంక్‌ ధర రూ. 1699 కాగా, పవర్‌ బ్యాంక్‌ 4ఐ ధర రూ.1299గా నిర్ణయించారు.

* షావోమీ ఇండియా పదేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో రోబో వాక్యూమ్‌ క్లీనరను తీసుకొచ్చింది. వాక్యూమ్‌ క్లీనర్‌ ఎక్స్‌10 పేరుతో లాంచ్‌ చేసిన ఈ వాక్యూమ్‌ క్లీన్‌ ధర రూ. 29,999గా నిర్ణయించారు. దీన్ని షావోమీ యాప్‌ ద్వారా కంట్రోల్ చేయొచచు. 5200 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఒకసారి ఛార్జింగ్‌ చేస్తే 240 నిమిషాల పాటు పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories