Red Magic 6 Pro: 18GB ర్యామ్‌తో ప్రపంచంలో ఫస్ట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Worlds First 18 GB Ram Smartphone Red Magic 6 Pro Released
x

రెడ్ మ్యాజిక్ 6, రెడ్ మ్యాజిక్ 6 ప్రోె స్మార్ట్ ఫోన్లు (ఫోటో ట్విట్టర్)

Highlights

Red Magic 6 Pro: ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే..స్మార్ట్ ఫోన్ అంత ఫాస్ట్‌ గా పనిచేస్తుంది.

Red Magic 6 Pro: మొబైల్ ఫోన్ కొనేప్పుడు అందరం చూసేది..ర్యామ్ సైజ్..ఎందుకంటే..ర్యామ్ ఎంత ఎక్కువ ఉంటే..స్మార్ట్ ఫోన్ అంత ఫాస్ట్‌ గా పనిచేస్తుంది. మనం ఇప్పటి వరకు 2, 4,6,8 జీబీ ర్యామ్ స్మార్ట్‌ఫోన్లనే వాడి ఉంటాం.కానీ, ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిగా 18 GB ర్యామ్ తో ఓ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. ఆ ఫోన్ వివరాలేంటో చూద్దాం...

టెన్ సెంట్ గేమ్స్‌ (Tencent Games)లో పేరు పొందిన నుబియా (Nubia) సంస్థ టెన్ సెంట్ ఎడిషన్ పేరుతో రెడ్ మ్యాజిక్ 6, రెడ్ మ్యాజిక్ 6 ప్రో అనే గేమింగ్ ఫోన్లను శుక్రవారం రిలీజ్ చేసింది. దీని లో రెడ్ మ్యాజిక్ 6 ప్రో (RedMagic 6 Pro) ను ప్రపంచంలోనే మొట్ట మొదటిగా 18GB ర్యామ్ తో లాంచ్ చేసింది.

RedMagic 6, RedMagic 6 Pro ఫీచర్లు...

  1. రెండు గేమింగ్ ఫోన్లు AMOLED స్కీన్‌ తో అలరించనున్నాయి. అలాగే 165Hz రీఫ్రెష్ రేటులో వస్తున్న ఈ ఫోన్లు..మన కంటిపై ప్రభావం పడకుండా అలాగే ఎక్కువసేపు బ్యాటరీ వచ్చేలా చేస్తుంది.
  2. 6.8 ఇంచుల స్కీన్ తో పాటు HD+AMOLED డిస్ ప్లే కలిగి ఉన్నాయి. వీటిలో క్వాల్‌కం స్నాప్ డ్రాగన్ 888 హై ఎండ్ ప్రాసెసర్ ను ఉపయోగించారు.
  3. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌లు 8GB/12GB/16GB/18GB ర్యామ్ లతో లభించనున్నాయి.
  4. ఇక స్టోరేజీ విషయానికి వస్తే..128GB/256GB/512GB (ROM) తో ఆఫర్ చేస్తున్నారు.
  5. ఈ రెండు మోడల్స్ ఆండ్రాయిడ్ 11 ని కొద్ది మార్పులు చేసి రూపొందించిన రెడ్ మ్యాజిక్ ఓఎస్ 4.0 (RedMagic OS 4.0) తో పనిచేయనున్నాయి.
  6. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ఫ్రింట్ తో రానున్న ఈ ఫోన్లు..వెనుక వైపు 64 MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2MP మాక్రో కెమెరా అందించారు. అలాగే సెల్పీ ప్రియుల కోసం ముందు భాగంలో 8MP కెమెరా అందించారు.
  7. ఇక బ్యాటరీ విషయానికి వస్తే..రెడ్ మ్యాజిక్ 6 ప్రో 4500mAh బ్యాటరితోపాటు 120W ఫాస్ట్ చార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. అలాగే రెడ్ మ్యాజిక్ 5050mAh బ్యాటరితో పాటు 66W ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట చేస్తుంది.

RedMagic 6 Pro Price (ధరలు):

  • రెడ్ మ్యాజిక్ 6 ఫోన్ రెండు రంగుల్లో (బ్యాక్, పల్స్ కలర్) లభిస్తాయి. అలాగే ఈ ఫోన్ ధర 3,799 యూనాన్(రూ.42,760).
  • రెడ్ మ్యాజిక్ 6 ప్రో కూడా రెండు రంగుల్లో (బ్లాక్, సిల్వర్) వస్తుంది. అలాగే ఈ పోన్ ధర 4399 యునాన్ (రూ. 49,510) లకు లభిస్తుంది.

సేల్ ఎప్పుడంటే...

రెండు ఫోన్లు చైనాలో శుక్రవారం విడుదల అయ్యాయి. ఇవి మార్చి 11న సేల్ కు రానున్నట్లు నుబియా కంపెనీ తెలిపింది. అలాగే ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ప్రపంచ వ్యాప్తంగా మార్చి 16న విడుదల చేస్తామని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories