Windows 10 Update: విండోస్-10 ఆపరేటింగ్ సిస్టం తాజా అప్డేట్ తో ప్రింట్ సమస్యలు!

Window 10 Operating System creating problems in Print documents
x

విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం 

Highlights

Windows 10 Update: మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో మీరు విండోస్10 ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారా? అయితే, ఈ ముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఒకరకంగా ఇది ఓ చేదు వార్త.

Windows 10 Update: మీ కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ లో మీరు విండోస్10 ఆపరేటింగ్ సిస్టం వాడుతున్నారా? అయితే, ఈ ముఖ్యమైన విషయాన్ని గమనించండి. ఒకరకంగా ఇది ఓ చేదు వార్త. తాజాగా విండోస్ అప్ డేట్ చేసుకున్న సిస్టమ్స్ లో ఎర్రర్ కనిపిస్తోంది. ఇది మొత్తం పీసీ కి కనిపించడంలేదు. మీ కంప్యూటర్ తో ఏదైనా ప్రింటర్ కి అనుసంధానం అయి ఉంటె మాత్రం ఈ ఎర్రర్ వస్తోంది. తమ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఇచ్చినపుడు ఎర్రర్ వస్తున్నట్టు విండోస్ ఆపరేటింగ్ సిస్టం తాజాగా అప్డేట్ చేసుకున్నకొందరు చెబుతున్నారు.

ప్రింటర్ కు విండోస్ తాజా వెర్షన్ నుంచి ప్రింట్ ఇచ్చినపుడు బ్లూ స్క్రీన్ కనిపించి "Your PC had a problem and needs to be restarted." అనే మెసేజ్ వస్తోందని వారు చెబుతున్నారు.

ఈ విషయంపై రెడిట్(Reddit)లో ఫిర్యాదు చేశారు కొందరు వినియోగదారులు. ఈ కంప్లైంట్ పై ఒక Reddit యూసర్ స్పందిస్తూ.. ఈ విషయం గురించి తనకు కూడా కొంతమంది చెప్పారని పేర్కొన్నారు.

ఒకవేళ మీ కంప్యూటర్ నుంచి ప్రింట్ ఇచ్చిన సమయంలో బ్లూ స్క్రీన్ పోస్ట్ కనిపిస్తే కనుక ప్రస్తుతానికి విండోస్ పాత వెర్షన్ కు మారడమే మార్గం అని ఆయన చెప్పారు. తాజా అప్డేట్ నుంచి వెనుకకు వెళ్లి పాత అప్డేట్ లో కొనసాగాలని ఆయన సూచించారు.

విండోస్ 10 తాజా అప్డేట్ లో సమస్య వస్తున్నందున.. పాత అప్డేట్ కు వెళ్ళడం ద్వారా సమస్యకు తాత్కాలికంగా పరిష్కారం లభిస్తుంది అని తెలిపారు. విండోస్ నుంచి తాజా అప్డేట్ లో వస్తున్న ఇబ్బందికి పరిష్కారం వచ్చేవరకూ ఈ విధానమే సరైనది అని అయన చెబుతున్నారు.

పాత అప్డేట్ కు మారడం ఇలా..

- Go to settings (సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి)

- Click Update & Security (అక్కడ అప్డేట్ అండ్ సెక్యూరిటీ క్లిక్ చేయాలి)

- Click Windows Update (తర్వాత విండోస్ అప్డేట్ పై క్లిక్ చేయాలి)

- Go to View update history (అక్కడ నుంచి వ్యూ అప్డేట్ హిస్టరీ లోకి వెళ్ళాలి)

- Now, click uninstall updates, or you can remove the patch manually at the command prompt. (తరువాత అన్ ఇంస్టాల్ అప్డేట్స్ పై క్లిక్ చేయాలి)

కొంతమంది రెడిట్ యూజర్లు ఈవిధంగా చేస్తే తమకు ఫలితం కనిపించినట్లు చెప్పారు. (రెడిట్ లో ఉన్న సమాచారం ఆధారంగా ఈ సూచనలు చయడం జరిగింది. విండోస్ నుంచి ప్రింట్ కి వచ్చే సమస్యల పరిష్కారానికి ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలని సూచించడమైనది.)

ఈ ఆర్టికల్ ను ఇంగ్లీష్ లో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
Next Story
More Stories