WhatsApp: ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ నిలిచిపోనుంది.? మీ ఫోన్‌ ఉందేమో చూసుకోండి..!

WhatsApp Will Stop Working on 35 Smartphones, Check Here for The List
x

WhatsApp: ఈ ఫోన్‌లలో వాట్సాప్‌ నిలిచిపోనుంది.? మీ ఫోన్‌ ఉందేమో చూసుకోండి..!

Highlights

WhatsApp: ప్రస్తుతం వాట్సాప్‌ ఉపయోగించని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

WhatsApp: ప్రస్తుతం వాట్సాప్‌ ఉపయోగించని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్‌గా నిలిచింది వాట్సాప్‌. మార్కెట్లోకి ఎన్ని రకాల మెసేజింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చినా వాట్సాప్‌కు క్రేజ్‌ తగ్గకపోవడానికి ప్రధాన కారణం ఇందులోని ఫీచర్స్‌. యూజర్ల అవసరాలకు, భద్రతకు పెద్ద పీట వేస్తూ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది.

ఈ క్రమంలోనే లేటెస్ట్ అప్‌డేట్స్‌ తీసుకొచ్చే క్రమంలో వాట్సాప్‌ కొన్ని పాత ఫోన్‌లకు తమ సేవలను నిలిపివేస్తూ వస్తోంది. లేటెస్ట్ వెర్షన్‌ ఫోన్‌లలోనే వాట్సాప్‌ సేవలను అందిస్తోంది. తాజాగా మరో 34 మోడల్స్‌లో తమ సేవలను ఆపేస్తున్నట్లు వాట్సాప్‌ ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఓ జాబితాను విడుదల చేసింది. ఇంతకీ ఈ జాబితాలో ఏయే ఫోన్‌లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

సామ్‌సంగ్ కంపెనీ విషయానికొస్తే.. గెలాక్సీ ఏస్ ప్లస్‌, గెలాక్సీ కోర్‌, గెలాక్సీ ఎక్స్‌ప్రెస్‌-2, గెలాక్సీ గ్రాండ్‌, గెలాక్సీ నోట్‌ 3, గెలాక్సీ ఎస్‌3 మినీ, గెలాక్సీ ఎస్‌4 యాక్టివ్‌, గెలాక్సీ ఎస్‌4 మినీ, గెలాక్సీ ఎస్‌4 జూమ్‌ మొబైళ్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. అలాగే మెటోరోలా కంపెనీలో మోటో జీ, మోటో ఎక్స్‌, యాపిల్‌ కంపెనీలో ఐఫోన్‌-5, ఐఫోన్‌-6, ఐఫోన్‌ 6S, ఐఫోన్‌ 6S ప్లస్‌, ఐఫోన్‌ SE, హువావే కంపెనీలో అసెండ్ P6 S, అసెండ్ G525, హువావే సీ199, హువావే జీఎక్స్‌1ఎస్‌, హువావే వై625,లెనోవో కంపెనీలో లెనోవా 46600, లెనోవా ఏ858టీ, లెనోవా పీ70, లెనోవా ఎస్‌890, సోనీ కంపెనీలో ఎక్స్‌పీరియా Z1, ఎక్స్‌పీరియా E3, ఎల్‌జీ కంపెనీలో ఆప్టిమస్‌ 4ఎక్స్‌ హెచ్‌డీ, ఆప్టిమస్‌ జీ, ఆప్టిమస్‌ జీ ప్రో, ఆప్టిమస్‌ ఎల్‌7 మోడళ్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories