WhatsApp Secret Features: వాట్సాప్‌లో మీ డేటా సేఫ్‌గానే ఉంటుంది.. ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా?

WhatsApp Secret Features: వాట్సాప్‌లో మీ డేటా సేఫ్‌గానే ఉంటుంది.. ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా?
x

WhatsApp Secret Features: వాట్సాప్‌లో మీ డేటా సేఫ్‌గానే ఉంటుంది.. ఈ సీక్రెట్ ఫీచర్స్ తెలుసా?

Highlights

ప్రస్తుతం మనం రోజూ వాడే వాట్సాప్‌ సెక్యూరిటీ పరంగా కొత్త కొత్త ఫీచర్లతో ముందుకెళ్తోంది. చాలామందికి తమ డేటా ప్రైవసీపై ఆందోళన ఉంటుంది.

WhatsApp Secret Features: ప్రస్తుతం మనం రోజూ వాడే వాట్సాప్‌ సెక్యూరిటీ పరంగా కొత్త కొత్త ఫీచర్లతో ముందుకెళ్తోంది. చాలామందికి తమ డేటా ప్రైవసీపై ఆందోళన ఉంటుంది. అలాంటి వారి కోసం కొన్ని సీక్రెట్, ప్రైవసీ ఫ్రెండ్లీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి యాక్టివేట్ చేస్తే మీ సమాచారం మరింత సురక్షితంగా ఉంటుంది. ఆ ఫీచర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

1. ఆటోమేటిక్ మెసేజ్ డిలీషన్ (Disappearing Messages)

ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే మీరు పంపిన మెసేజ్‌లు కొంత సమయం తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్‌ అవుతాయి. ఇది ఫైర్‌సీ పరంగా చాలా ఉపయోగకరం. మీ చాట్‌లను ఎవరూ స్పై చేయలేరు లేదా హ్యాక్ చేయలేరు.

2. కమ్యూనిటీ ఫీచర్

ఇప్పుడు పాఠశాలలు, కార్యాలయాలు, అపార్ట్‌మెంట్‌ సమూహాల కోసం బహుళ గ్రూపులను ఒకేచోట కలిపే కమ్యూనిటీ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇది సమాచారాన్ని సులభంగా పంచుకోవడంలో చాలా సహాయపడుతుంది.

3. వాయిస్ మెసేజ్‌ను ముందుగా వినే అవకాశం

వాయిస్ మెసేజ్ పంపించే ముందు వినచ్చు. తప్పుగా రికార్డ్ అయినా పంపించకుండా నిలిపేయవచ్చు. అలాగే, పంపిన మెసేజ్‌లను 15 నిమిషాల్లో ఎడిట్ చేయొచ్చు. టైపింగ్ తప్పిదాల గురించి ఇక ఆందోళన అవసరం లేదు.

4. ‘Add Yours’ స్టిక్కర్ స్టేటస్‌లో

ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘యాడ్ యువర్స్’ స్టైల్ ఫీచర్ ఇప్పుడు వాట్సాప్ స్టేటస్‌లో అందుబాటులో ఉంది. స్టేటస్‌లో స్టిక్కర్‌ను యాడ్ చేసి మీ స్నేహితులను స్పందించేందుకు ఆహ్వానించవచ్చు. స్టిక్కర్ ప్రేమికులకు ఇది బాగా నచ్చుతుంది.

5. స్క్రీన్ షేరింగ్ + చాట్ లాక్

వీడియో కాల్ సమయంలో స్క్రీన్‌ను షేర్ చేసుకునే ఫీచర్ ఇప్పుడు లభిస్తోంది. మీటింగ్‌లు, డెమోలు చెప్తున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది. అదనంగా, వ్యక్తిగత చాట్‌లను పాస్‌వర్డ్, ఫింగర్‌ప్రింట్‌తో లాక్ చేసే ఫీచర్‌ కూడా ఉంది. ఇక మీ ప్రైవేట్ మెసేజ్‌లను ఎవరూ చూడలేరు.

ఈ ఫీచర్లతో మీ వాట్సాప్ అనుభవం మరింత సేఫ్, స్మార్ట్, సులభంగా మారుతుంది. మీరు ఇవన్నీ ఉపయోగిస్తున్నారా? లేదంటే, ఈరోజే ఆన్ చేయండి!

Show Full Article
Print Article
Next Story
More Stories