WhatsApp Latest Update: స్కాన్‌ చేయకుండానే 4 డివైజ్‌ల్లో వాట్సప్ లాగిన్!

Whatsapp New Feature For Users Access 4 Linked Devices Without App
x

వాట్సప్‌ (ఫొటో ట్విట్టర్)

Highlights

WhatsApp Latest Update 2021: వాట్సాప్​ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది.

WhatsApp Latest Update 2021: వాట్సాప్​ యూజర్లకు మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. స్మార్ట్​ ఫోన్​ అవసరం లేకుండా ఒకేసారి 4 డివైజ్​లలో లాగిన్​ అయ్యేలా ఈ ఫీచర్​ త్వరలో రానున్నట్లు కంపెనీ సీఈవో​ విల్​ క్యాథ్​కార్ట్​​ స్పష్టం చేశారు.

ఓ ఇంటర్వ్యూలో ఆయన​ మాట్లాడుతూ.. యూజర్ల సౌలభ్యం కోసం మేం నిరంతరం పనిచేస్తూనే ఉంటాం. సరికొత్త ఫీచర్లను అందించేందుకు ప్రయత్నిస్తుంటాం. తాజాగా ఒకేసారి 4 డివైజ్​లలో లాగిన్​ అయ్యేలా సరికొత్త ఆఫ్షన్‌పై పనిచేస్తున్నాం. ఈ ఫీచర్‌తో ఐప్యాడ్​లోనూ ఇక వాట్సాప్ లాగిన్​ కావొచ్చని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం వాట్సాప్​ వెబ్​, డెస్క్​టాప్​ లో లాగిన్ అయ్యేందుకు స్మార్ట్ ఫోన్​తో స్కాన్ చేయాల్సిందే. అయితే ఈ సరికొత్త ఫీచర్‌తో మెయిన్​ యాప్​, స్మార్ట్​ ఫోన్ యాప్​​ సపోర్ట్ లేకుండా మల్టీ డివైజ్​ ఫీచర్​ తో లాగిన్​ కావొచ్చని తెలుస్తోంది.

ఇదే విషయంపై ఫేస్‌బుక్ అధినేత మార్క్​ జుకర్​బర్గ్​ కూడా ఓ ప్రకటన విడుదల చేశాడు. ప్రైవసీ సమస్యలున్నప్పటికీ ఈ సరికొత్త ఫీచర్‌ను ఓ టెక్నికల్ ఛాలెంజ్​గా తీసుకున్నాం. ఫోన్​ స్విచ్ఛాప్ అయినా.. మల్టీ డివైజ్ లాగిన్​ తో వాట్సాప్​ పని చేసేలా డిజైన్ చేయబోతున్నామని తెలిపాడు. దీంతోపాటు 'వ్యూ వన్స్​' ఫీచర్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అంటే అవతలి యూజర్​ ఒకసారి ఫొటో, వీడియో చూడగానే దానంతట డిలీట్ అయ్యే ఫీచర్ అన్నమాట. ముందుముందు వాట్సప్‌లో మరిన్ని అప్‌డేట్స్‌ రానున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories