WhatsApp 2026 New Year Features: స్టిక్కర్స్, వీడియో కాల్ ఎఫెక్ట్స్ మరియు మరిన్ని!

WhatsApp 2026 New Year Features: స్టిక్కర్స్, వీడియో కాల్ ఎఫెక్ట్స్ మరియు మరిన్ని!
x
Highlights

వాట్సప్ 2026 న్యూ ఇయర్ ఫీచర్స్: స్టిక్కర్స్, వీడియో కాల్ ఎఫెక్ట్స్, స్టేటస్ అప్‌డేట్స్, గ్రూప్ పోల్స్, లైవ్ లొకేషన్ షేర్ మరియు మరిన్ని వివరాలు.

నూతన సంవత్సరం 2026ను స్వాగతించేందుకు ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్ పలు కొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వాట్సప్‌లో ఈ న్యూ ఇయర్ ఫీచర్లలో స్టిక్కర్స్, వీడియో కాల్ ఎఫెక్ట్స్, స్టేటస్ అప్‌డేట్స్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

2026 న్యూ ఇయర్ స్టిక్కర్స్

వాట్సప్ యాప్ కొత్త 2026 థీమ్ డిజైన్‌తో స్టిక్కర్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. యూజర్లు ఈ స్టిక్కర్స్‌ను చాట్‌లో పంపి, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.

వీడియో కాల్ ఎఫెక్ట్స్

వాట్సప్ వీడియో కాల్‌లో పైర్‌వర్క్స్, స్టార్‌లైట్, రంగుల కాగితాల ముక్కలు (confetti) వంటి యానిమేటెడ్ ఎఫెక్ట్స్ ఉపయోగించవచ్చు. ఇవి వీడియో కాల్‌కు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయి.

ఎమోజి రియాక్షన్స్‌లో confetti

చాట్‌లో మెసేజ్‌లపై యూజర్లు రంగుల కాగితాల ముక్కలు వెదజల్లే (confetti) యానిమేటెడ్ రియాక్షన్స్ ఇవ్వవచ్చు, ఇది చాట్‌కు మరింత జీవం తీసుకువస్తుంది.

స్టేటస్ అప్‌డేట్ ఫీచర్స్

వాట్సప్‌లో స్టేటస్ పోస్టులకు యానిమేటెడ్ స్టిక్కర్స్ మరియు న్యూ ఇయర్ 2026 లే అవుట్‌ను యాడ్ చేయగల ఫీచర్ అందుబాటులో ఉంది.

గ్రూప్ చాట్ & పోల్స్

యూజర్లు గ్రూప్ చాట్‌లో ఈవెంట్స్ క్రియేట్ చేయడం, వాటిని పిన్ చేయడం, మరియు వివిధ యాక్టివిటీల కోసం పోల్స్ నిర్వహించడం వంటి ఫీచర్లను ఉపయోగించవచ్చు.

లైవ్ లొకేషన్ షేర్

పార్టీ లేదా స్నేహితులతో మీ స్థలాన్ని పంచుకోవడానికి లైవ్ లొకేషన్ షేర్ ఫీచర్ అందుబాటులో ఉంది.

వీడియో & వాయిస్ నోట్స్

మీ స్నేహితులతో గడిపిన మధురమైన క్షణాలను వీడియో నోట్స్ మరియు వాయిస్ నోట్స్ ద్వారా రికార్డ్ చేయవచ్చు.

నిషేధం విధించిన వాట్సప్ అకౌంట్స్

వాట్సప్ నిబంధనలను ఉల్లంఘించినందున, ప్రతి నెల సగటున 9.8 మిలియన్లకు పైగా ఇండియన్ వాట్సప్ అకౌంట్స్‌పై నిషేధం విధించబడుతోంది.

వీటితో, నూతన సంవత్సరం వేడుకల్లో వాట్సప్ యూజర్ల కోసం మరిన్ని వినూత్న ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories