Refurbished Phone: రీఫర్బిష్‌డ్‌ ఫోన్‌ అంటే ఏంటి.. దీనిని కొనడం లాభమా, నష్టమా..!

What Is A Refurbished Phone Know Whether Buying It Is A Profit Or A Loss
x

Refurbished Phone: రీఫర్బిష్‌డ్‌ ఫోన్‌ అంటే ఏంటి.. దీనిని కొనడం లాభమా, నష్టమా..!

Highlights

Refurbished Phone:నేటి రోజుల్లో మార్కెట్‌లో రీఫర్బిష్‌డ్‌ ఫోన్‌ల ట్రెండ్‌ పెరుగుతోంది.కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి బదులుగా తక్కువ ధరకు పాత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు.

Refurbished Phone: నేటి రోజుల్లో మార్కెట్‌లో రీఫర్బిష్‌డ్‌ ఫోన్‌ల ట్రెండ్‌ పెరుగుతోంది.కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయడానికి బదులుగా తక్కువ ధరకు పాత ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్‌లో రీఫర్బిష్‌డ్‌ ఫోన్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చాలామందికి రీఫర్బిష్‌డ్‌ ఫోన్లు అంటే తెలియదు. వీటిని కొనడం వల్ల లాభమా, నష్టమా తెలుసుకుందాం. చాలామంది ఎక్స్ఛేంజ్ ఆఫర్ గురించి వినే ఉంటారు. కొంతమంది తరచుగా ఫోన్‌లను మారుస్తారు. దీని కోసం ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ఉపయోగించుకుంటారు.

రీఫర్బిష్‌డ్‌ ఫోన్‌ అంటే ఏంటి..?

కస్టమర్లు చిన్న చిన్న లోపాల కారణంగా లేదా వాటిని ఇష్టపడనందున తిరిగి విక్రేత వద్దక వచ్చే ఫోన్లను రీఫర్బిష్‌డ్‌ ఫోన్‌లు అంటారు. విక్రేత వాటిని వెనక్కి తీసుకుని రిపేర్ చేసి మళ్లీ మార్కెట్‌లో అమ్మకానికి పెడుతాడు. ఈ ఫోన్లు కొత్త ఫోన్ల కంటే తక్కువ ధరకే లభిస్తాయి. మీరు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు Amazon-Flipkartలో తరచుగా ఈ ఫోన్‌లను చూడవచ్చు.రీఫర్బిషింగ్ అంటే ఏదైనా ఫోన్‌ని విడదీయడం లేదా రిపేర్ చేయడం. అంటే ఈ ఫోన్లు చిన్న లోపాల వల్లనో, నచ్చకనో తిరిగి వచ్చేవి. అయితే ఈ ఫోన్‌లు కొనాలా వద్దా అనే అనుమానం చాలామందిలో ఉంది. దాని గురించి తెలుసుకుందాం.

మోడల్-బ్రాండ్ తేడా చేస్తుంది

మీరు రీఫర్బిష్‌డ్‌ ఫోన్‌లు కొనుగోలు చేస్తే ఆ ఫోన్ బ్రాండ్, మోడల్‌లో తేడా ఉంటుంది. అందుకే మంచి కంపెనీ ఫోన్‌లు కొనుగోలు చేయాలి.ఉదాహరణకు మీరు ఆపిల్ ఫోన్ కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం ఉంటాయి. నిజానికి చాలా మంది యాపిల్ యూజర్లు ఫోన్‌ల మోడల్స్‌ని తరచుగా మారుస్తుంటారు. ఈ ఫోన్లు తక్కువగా వాడినవి ఉంటాయి. వాటిలో లోపాలు ఎక్కువగా కనిపించవు.

రీఫర్బిష్‌డ్‌ ఫోన్‌లు కొనుగోలు చేసేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

1. మీరు ఇలాంటి ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడు అధికారిక ప్లాట్‌ఫారమ్ నుంచి మాత్రమే కొనుగోలు చేయాలి.

2. నష్టాన్ని నివారించాలంటే స్మార్ట్‌ఫోన్ IMI నంబర్‌ను ట్రాక్ చేయడం ముఖ్యం.

3. ఫోన్‌ని ఆర్డర్ చేసినప్పుడల్లా, రిటర్న్ పాలసీని చెక్‌ చేయాలి. మీకు ఫోన్ నచ్చకపోతే దాన్ని తిరిగి ఇవ్వవచ్చు.

4. రీఫర్బిష్‌డ్‌ ఫోన్‌ కొనుగోలు చేసేటప్పుడు దానిలోని సెన్సార్‌ని చెక్‌చేయాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories