SpaceX: పరీక్ష చేయకముందే పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్, వరుసగా ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బలు

SpaceX
x

SpaceX: పరీక్ష చేయకముందే పేలిపోయిన స్పేస్ ఎక్స్ స్టార్ షిప్, వరుసగా ఎలాన్ మస్క్‌కు ఎదురుదెబ్బలు

Highlights

SpaceX: తాజాగా ఈ సంస్థకు చెందిన మరో స్టార్​ షిప్ ఫైర్ టెస్టు చేసేందుకు ఉంచిన సమయంలో పేలి పోయింది.

SpaceX: అంతరిక్ష రంగంపై మరింత పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోన్న అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ మరోసారి ఎదురుదెబ్బను చూసింది. తాజాగా ఈ సంస్థకు చెందిన మరో స్టార్​ షిప్ ఫైర్ టెస్టు చేసేందుకు ఉంచిన సమయంలో పేలి పోయింది.

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ గతకొంతకాలంగా అంతరిక్షయానంలో తమదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా స్పేస్ షిప్‌లను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్దం చేస్తుంది. అయితే కొంతకాలంగా వీటిని పరీక్ష చేసే సమయంలో ఫెయిల్ అవుతున్నాయి. ఇప్పటివరకు మూడు స్పేస్ షిప్‌లు ఫెయిల్ అయ్యాయి. వీటిని పరీక్ష చేస్తున్న సమయంలోనే ఈ ఘటనలు జరిగాయి.

ఫెయిల్ అయిన స్పేస్ షిప్‌లలో మొదటిది ఆకాశంలోకి విజయవంతంగా దూసుకెళ్లిన తర్వాత ఫెయిల్ అయితే మిగిలిన రెండు స్పేస్ షిప్‌లు పరీక్ష చేసిన వెంటనే గాల్లోనే పేలిపోయాయి. అయితే తాజాగా పదవ స్పేస్ షిప్‌ను పరీక్షించేందుకు స్పేస్ ఎక్స్ సన్నహాలు చేస్తుంది. అయితే అంతకు ముందే అది పేలి పోయింది. పదవ స్పేస్ షిప్ పరిశీలన దశలో ఉండగానే పేలిపోయిందని స్పేస్ ఎక్స్ అధికారులు వెల్లడించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. సుదీర్ఘ అంతరిక్ష యాత్రలకోసం రూపొందిస్తున్న ఈ స్పేస్ షిప్‌లు ఇలా వరుసగా ఫెయిల్ అవ్వడంతో అనుకున్నది సాధించడంలో కాస్త ఆలస్యం జరగొచ్చని స్పేస్ ఎక్స్ నిపుణులు చెబుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories