High Battery Backup: అధిక బ్యాటరీ బ్యాకప్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లు కావాలా.. ఇవి చాలా చౌకగా లభిస్తున్నాయి..!

Want Smartphones With High Battery Backup These Are Available Very Cheaply
x

High Battery Backup: అధిక బ్యాటరీ బ్యాకప్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్లు కావాలా.. ఇవి చాలా చౌకగా లభిస్తున్నాయి..!

Highlights

High Battery Backup: స్మార్ట్‌ఫోన్‌ కొనాలనేవారికి ఇది మంచి సమయం అని చెప్పాలి.

High Battery Backup: స్మార్ట్‌ఫోన్‌ కొనాలనేవారికి ఇది మంచి సమయం అని చెప్పాలి. ఎందుకంటే పండుగ సీజన్‌ వచ్చింది కాబట్టి ఈ కామర్స్‌ సంస్థలు చాలా తక్కువ ధరలో ఫోన్లని అందిస్తున్నాయి. మంచి ఫీచర్లు, బ్యాటరీ బ్యాకప్‌ కలిగిన ఫోన్లపై డిస్కౌంట్లు అందిస్తున్నాయి. Samsung నుంచి Realme వరకు అన్ని ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజు కొన్ని అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ గురించి తెలుసుకుందాం.

TECNO పోవా 5

TECNO పోవా 5 ఫోన్‌లో గొప్ప ఫీచర్లను పొందుతారు. ఇది 45W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫోటో-వీడియోగ్రఫీ కోసం డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. అమెజాన్ నుంచి కేవలం రూ.11,999కి 8 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M13

ఈ Samsung ఫోన్‌లో 6000mAh బ్యాటరీని పొందుతారు. ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. బేసిక్‌ కెమెరా 50 మెగాపిక్సెల్‌లు, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్‌లు, 2 మెగాపిక్సెల్ కెమెరా అందిస్తున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ.17,999 అయినప్పటికీ 38 శాతం తగ్గింపుతో కేవలం రూ.11,199కే కొనుగోలు చేయవచ్చు.

రియల్మే నార్జో 50a

మీరు ఈ ఫోన్‌ను 4GB RAM + 128 స్టోరేజ్, 25 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,499కే కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. బేసిక్‌ కెమెరా 50 మెగాపిక్సెల్‌లు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, వీడియో కాలింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి.

Redmi 9 పవర్

Redmi 9 ఫోన్ ధర రూ.15,999 అయినప్పటికీ అమెజాన్‌లో 17 శాతం తగ్గింపుతో రూ.13,290కి కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లోని బ్యాటరీ గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇందులో 6000mAh బ్యాటరీని పొందుతారు.

Samsung Galaxy M34

ఈ సామ్‌సంగ్ ఫోన్ కొనడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫోన్ అసలు ధర రూ.28,499 అయితే దీన్ని 26 శాతం తగ్గింపుతో రూ. 20,999కి పొందుతున్నారు. ఫోటో-వీడియోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్‌ను పొందుతారు. దీని బేసిక్‌ కెమెరా 50 మెగాపిక్సెల్‌లు, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్‌లు, 2 మెగాపిక్సెల్‌లు ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories