Vivo V70 FE: ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా.. Vivo V70 FE సంచలనం..!

Vivo V70 FE
x

Vivo V70 FE: ఫోన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా.. Vivo V70 FE సంచలనం..!

Highlights

Vivo V70 FE: వివో ప్రియులకు త్వరలోనే అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోంది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వివో, ఇప్పుడు 'V70' సిరీస్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది.

Vivo V70 FE: వివో ప్రియులకు త్వరలోనే అదిరిపోయే గుడ్ న్యూస్ అందబోతోంది. స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న వివో, ఇప్పుడు 'V70' సిరీస్‌తో మార్కెట్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఈ సిరీస్‌లో రాబోతున్న Vivo V70 FE మోడల్ గురించి ప్రస్తుతం టెక్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. యూరప్‌కు చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ EPREL డేటాబేస్‌లో ఈ ఫోన్ ప్రత్యక్షం కావడంతో, దీని లాంచ్ చాలా దగ్గరలోనే ఉందని స్పష్టమవుతోంది. స్టైలిష్ లుక్ మాత్రమే కాకుండా, పెర్ఫార్మెన్స్‌లో కూడా ఇది నెక్స్ట్ లెవల్ ఫీచర్లను కలిగి ఉండబోతోంది.

సాధారణంగా స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు అందరూ చూసే మొదటి విషయం బ్యాటరీ బ్యాకప్. ఈ విషయంలో వివో వినియోగదారులను అస్సలు నిరాశపరచడం లేదు. Vivo V70 FEలో ఏకంగా 7,000mAh భారీ బ్యాటరీని అందించనున్నారు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 67 గంటల పైగా బ్యాకప్ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి తోడు 55W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండటంతో భారీ బ్యాటరీ అయినా వేగంగా ఛార్జ్ అవుతుంది. దాదాపు 1,600 సార్లు ఛార్జ్ చేసిన తర్వాత కూడా బ్యాటరీ తన సామర్థ్యాన్ని 80 శాతం వరకు నిలుపుకోవడం ఈ ఫోన్ ప్రత్యేకత.

కేవలం ఫీచర్లు మాత్రమే కాకుండా ఫోన్ మన్నిక విషయంలో కూడా వివో గట్టి జాగ్రత్తలే తీసుకుంది. ఈ ఫోన్‌కు IP68 రేటింగ్ ఉండటంతో నీటిలో పడినా లేదా ధూళి తగిలినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. స్క్రీన్ విషయంలో కూడా మోహ్స్ హార్డ్నెస్ స్కేల్‌పై లెవల్ 4 స్క్రాచ్ రెసిస్టెన్స్ ఉండటంతో చిన్నపాటి గీతలు పడకుండా రక్షణ లభిస్తుంది. డ్రాప్ ప్రొటెక్షన్, రిపేరబిలిటీలో కూడా దీనికి మంచి రేటింగ్ దక్కడం విశేషం. ఫోన్ చేతిలో నుంచి జారి పడినా అంత త్వరగా పాడవకుండా గట్టి నిర్మాణంతో వస్తోంది.

ఒకప్పుడు ఫోన్ కొంటే రెండు మూడేళ్లకే సాఫ్ట్‌వేర్ పరంగా పాతబడిపోయేవి. కానీ Vivo V70 FE విషయంలో ఆ భయం అవసరం లేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏకంగా ఐదు సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ లభిస్తాయని సమాచారం. దీనివల్ల ఫోన్ సెక్యూరిటీ పరంగా ఎప్పుడూ లేటెస్ట్‌గా ఉంటుంది. వినియోగదారులు కూడా ఎక్కువ కాలం పాటు కొత్త ఫీచర్లను ఆస్వాదించే అవకాశం ఉంటుంది. కొత్త ఓఎస్ అప్‌డేట్స్ మరియు సెక్యూరిటీ ప్యాచెస్‌తో ఫోన్ ఎప్పుడూ స్మూత్‌గా పనిచేస్తుంది.

యూరోపియన్ ప్రొడక్ట్ రిజిస్ట్రీ ఫర్ ఎనర్జీ లేబెలింగ్ డేటాబేస్‌లో వివో V2550 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ లిస్ట్ కావడంతో త్వరలోనే ఇది మన ముందుకు రానుంది. కేవలం FE మోడల్ మాత్రమే కాకుండా, ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు స్మార్ట్‌ఫోన్లు ఉండే అవకాశం ఉంది. 2025 జూన్ నాటికి ఈ ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లో సందడి చేసే అవకాశం కనిపిస్తోంది. అదిరిపోయే కెమెరా, శక్తివంతమైన బ్యాటరీ, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కోరుకునే వారికి ఈ ఫోన్ ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories