Vivo V50e: వచ్చే నెలలో వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్ ధరకే అప్‌గ్రేడ్ ఫీచర్లు..!

Vivo V50e to be Launched in the First Week of April Features Price Leaked
x

Vivo V50e: వచ్చే నెలలో వివో నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. బడ్జెట్ ధరకే అప్‌గ్రేడ్ ఫీచర్లు..!

Highlights

Vivo V50e: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Vivo V50e ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానుంది.

Vivo V50e: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Vivo V50e ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కానుంది. కంపెనీ ఈ వివో ఫోన్‌ను 30,000 కంటే తక్కువ ధరతో పరిచయం చేస్తుంది. Vivo V50e మొబైల్ Vivo V40e అప్‌గ్రేడ్ మొబైల్. కంపెనీ విడుదల తేదీని వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ వివిధ ధృవీకరణ సైట్స్‌లో కనిపించింది. దీని ద్వారా ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ప్రస్తుతం వివో V50e ఫోన్ లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్‌లు, ధర గురించి సమాచారం అందుబాటులో ఉంది.

మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, Vivo V50e మొబైల్ ఏప్రిల్ మొదటి వారంలో దేశంలో విడుదలవుతుందని భావిస్తున్నారు. అయితే, కంపెనీ ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. ఈ ఫోన్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్ సాధించింది. నివేదిక ప్రకారం.. ఈ ఫోన్ రెండు కలర్స్‌లో వస్తుంది. మీరు సఫైర్ బ్లూ, పెర్ల్ వైట్ కలర్స్‌లో కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు Vivo V40e ఫోన్‌ని పోలి ఉండే అవకాశం ఉంది.

Vivo V50e Price

Vivo V50e ఫోన్ ధర విషయానికి వస్తే దేశంలో రూ. 25,000 నుంచి రూ. 30,000 మధ్య ఉంటుంది. బడ్జెట్‌లో వస్తుంది. ముఖ్యంగా Vivo V40e ఫోన్ బేస్ మోడల్ ధర రూ. 28,999 మాత్రమే.

Vivo V50e Features And Specifications

వివో V50e మొబైల్‌లో 6.77-అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే సైజు Vivo V40e ఫోన్ మాదిరిగానే ఉంటుంది. ఫోన్ మీడియాటెక్ 7300 ప్రాసెసర్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఫోన్‌లో 8GB RAM+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో వస్తుంది.

స్మార్ట్‌ఫోన్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా ఉంది. దీనితో పాటు, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా అందుబాటులో ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. మొబైల్ 5,600mAh కెపాసిటీ బ్యాటరీతో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందించారు.

ఇది Vivo V40e ఫోన్ 5,500mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్‌పై కొంచెం అప్‌గ్రేడ్ అవుతుంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఈ మొబైల్ IP68 / IP69 రేటింగ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, GPS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories