Vivo V50e: భారత్‌ మార్కెట్‌లోకి వివో V50e.. స్టైలిష్‌ లుక్‌, ప్రీమియం ఫీచర్లు అదుర్స్‌..!

Vivo V50e Launched in India with Stylish Design 50MP Camera and Premium Features
x

Vivo V50e: భారత్‌ మార్కెట్‌లోకి వివో V50e.. స్టైలిష్‌ లుక్‌, ప్రీమియం ఫీచర్లు అదుర్స్‌..!

Highlights

Vivo V50e Features: భారత్‌ మార్కెట్‌లోకి వీవో V50e వచ్చేసింది. అదిరిపోయే స్టైలిష్‌ లుక్‌తోపాటు దీని ప్రీమియం ఫీచర్స్‌ ఏంటో ఓ లుక్కేద్దామా?

Vivo V50e: భారత టెక్ మార్కెట్‌లోకి వీవో V50e గురువారం ప్రారంభించారు. అద్బుతమైన 8 GB RAM, 7300 Mediatek Dimensityతో కూడిన పవర్‌ ఫుల్‌ ఫోన్‌ అని చెప్పాలి. ఎప్పటి నుంచో చాలామంది ఈ ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దీని బ్యాటరీ 5600Ah, 90w వైర్‌తో ఫాస్ట్‌ ఛార్జింగ్‌ అవుతుంది. అంతేకాదు ఈ వీవో ఫోన్‌ 50 మెగా పిక్సెల్‌ డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంటుంది. దీంతో పాటు 50 ఎంపీ సెల్పీ షూటర్‌ కూడా. ప్రత్యేకంగా భారత యూజర్ల కెసం వెడ్డింగ్‌ ఫోర్ట్రెయిట్‌ స్డూడియో మోడ్‌తో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ఈ వివో ఫోన్‌లో రివర్స్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌ కూడా ఉంది. ఎక్కువ స్టోరేజ్‌ కోరుకునే వారికి ఈ ఫోన్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పాలి. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే చాలు రోజంతటికీ అవసరం ఉండదు.

అయితే, మన భారత మార్కెట్‌లో 8GB+128GB ఫోన్‌ ప్రారంభ ధర రూ.28,999 ఉంది. ఇక 8GB+256GB వేరియంట్‌ ధర రూ.30,999 మాత్రమే. అయితే, ఈ ఫోన్‌ వివిధ రంగుల్లో కూడా అందుబాటులో ఉంది. పియర్ల్‌ వైట్‌, సఫైర్‌ బ్లూ ఉంది. ఈ ఫోన్‌ మీరు కూడా కొనుగోలు చేయాలనుకుంటే అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఏప్రిల్‌ 17న ప్రారంభం కానున్న వివో ఇండియా ఇస్టోర్‌లలో కూడా అందుబాటులో ఉండనుంది. ప్రీ బుకింగ్‌ కూడా స్వీకరిస్తున్నారు.

వివో V50e ఫోన్‌ 6.77 AMOLED అంగుళా డిస్‌ప్లే, 300Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, 2,160Hz PWM డైమింగ్‌ రేట్‌, SGS బ్లూ లైట్‌ సర్టిఫికేషన్‌,HDR10+ సపోర్ట్‌, డైమండ్‌ షీల్డ్‌ గ్లాస్‌ ప్రొటెక్ష్‌ కలిగి ఉంటుంది.

ఇక ఈ వివో V50e ఆండ్రాయిడ్‌ 15 FuntouchOS15.ఇందులో ఓఎస్‌ అప్‌గ్రేడ్‌, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్‌ పొందుతారు. అంతేకాదు ఈ ఫోన్‌లో ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ కూడా ఉంటుంది. IP68, IP69 డస్ట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ కూడా కలిగి ఉంది. 5G, 4G, వైఫై, బ్లూటూత్‌, ఓటీజీ, జీపీఎస్‌, యూఎసీ టైప్‌-సీ పోర్ట్‌ ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories