Vivo T4x 5G: వివో నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. తక్కువ ధరలో వేరే లెవల్ ఫీచర్స్..!

Vivo has Launched its New Vivo T4x 5G smartphone in India
x

Vivo T4x 5G: వివో నుంచి కొత్త బడ్జెట్ ఫోన్.. తక్కువ ధరలో వేరే లెవల్ ఫీచర్స్..!

Highlights

Vivo T4x 5G: వివో దేశంలో తన కొత్త 'Vivo T4x 5G' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 15,000 బడ్జెట్ విభాగంలోకి వస్తుంది.

Vivo T4x 5G: వివో దేశంలో తన కొత్త 'Vivo T4x 5G' స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ రూ. 15,000 బడ్జెట్ విభాగంలోకి వస్తుంది. ఈ విభాగంలో Realme P3x 5G, OPPO 12x 5G, Motorola G64 5G వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది. ఈ ఫోన్ మీడియాటెక్ 7000 సిరీస్ చిప్‌సెట్, ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ, తాజా సాఫ్ట్‌వేర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో వస్తుంది. ఈ ఫోన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Vivo T4x 5G Price And Offers

బ్యాంక్ ఆఫర్ల విషయాననికి వస్తే.. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్,ఎస్‌బిఐ కార్డ్‌ల ద్వారా ఈ ఫోన్‌‌పై రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. మెరైన్ బ్లూ, ప్రోంటో పర్పుల్ అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ డివైస్ పరిచయం చేశారు. వివో ఈ బడ్జెట్ ఫోన్ మార్చి 12 నుండి మధ్యాహ్నం 12 గంటలకు వివో ఈ-స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ప్రధాన ఛానెల్‌లలో అందుబాటులో ఉంటుంది.

Vivo T4x 5G Variants

6GB + 128GB Rs. 12,999

8GB + 128GB Rs.13,999

8GB + 256GB Rs.15,999

Vivo T4x 5G Specifications

ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్ ఉంది. 6GB/8GB RAM + 128GB/256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 8GB వరకు వర్చువల్ ర్యామ్‌‌కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,500mAh బ్యాటరీ అందించారు. అలానే 6.72-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది.

కెమెరా విషయానికి వస్తే వెనుక కెమెరా 50MP ప్రైమరీ (f/1.8) + 2MP బోకె (f/2.4), ముందు కెమెరా 8MP (f/2.05), ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్‌లో రన్ అవుతుంది. 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు ఇస్తుంది. ఇతర ఫీచర్స్‌లో గేమింగ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, 4D గేమ్ వైబ్రేషన్, వైఫై, బ్లూటూత్ ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories