UPI : యూపీఐ సేవల్లో మళ్ళీ అంతరాయం.. పదే పదే ఎందుకిలా అవుతుంది..!

UPI : యూపీఐ సేవల్లో మళ్ళీ అంతరాయం.. పదే పదే ఎందుకిలా అవుతుంది..!
x
Highlights

UPI: దేశవ్యాప్తంగా Unified Payments Interface (UPI) సేవల్లో అంతరాయం ఏర్పడింది. UPI ద్వారా చెల్లింపులు జరపడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

UPI: దేశవ్యాప్తంగా Unified Payments Interface (UPI) సేవల్లో అంతరాయం ఏర్పడింది. UPI ద్వారా చెల్లింపులు జరపడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది వినియోగదారుల డబ్బులు చెల్లింపుల సమయంలో నిలిచిపోయాయి. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, UPI సేవలకు సంబంధించి మధ్యాహ్నం వరకు 2,000 కంటే ఎక్కువ ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా చెల్లింపులు, నిధుల బదిలీలో వినియోగదారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. సర్వర్ లో సమస్యల కారణంగా UPI సేవలకు అంతరాయం ఏర్పడింది.నివేదిక ప్రకారం, 80% మంది చెల్లింపులు చేయడంలో, 18% మంది నిధుల బదిలీ చేయడంలో, 2% మంది కొనుగోళ్లు చేయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

గతంలో కూడా ఇలాంటి సమస్యలు:

గతంలో కూడా దేశవ్యాప్తంగా UPI వినియోగదారులు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్చి 26 న కూడా చెల్లింపులు చేయడంలో సమస్యలు తలెత్తాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్గత సమస్యల కారణంగా నిధుల బదిలీలు, చెల్లింపులు నిలిచిపోయాయని తెలిపింది. ప్రస్తుతం Google Pay, PhonePe, Paytm వంటి యాప్‌ల ద్వారా నిధుల బదిలీలు చేయడంలో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.డిజిటల్ యుగంలో UPI ద్వారా చెల్లింపులు చేయనివారు చాలా తక్కువ.ఈ వ్యవస్థ ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రజల చెల్లింపులు ఆగిపోయాయి. కొంతమంది వినియోగదారుల నుండి ఒకే చెల్లింపుకు రెండుసార్లు డబ్బులు కట్ అయ్యాయి. వినియోగదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X , డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్‌లో తమ సమస్యలను వివరిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories