సునిత విలియమ్స్, బుచ్ విల్మోర్ వస్తున్న స్పేస్ఎక్స్ క్యాప్సూల్ భూమ్మీదకు ఎలా నావిగేట్ అవుతుంది?

సునిత విలియమ్స్, బుచ్ విల్మోర్ వస్తున్న స్పేస్ఎక్స్ క్యాప్సూల్ భూమ్మీదకు ఎలా నావిగేట్ అవుతుంది?
x
Highlights

How spacex capsule find its way to earth: 17 గంటల ప్రయాణం తరువాత అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ఎక్స్ డ్రాగాన్ క్యాప్సూల్..

సునిత విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇంకొన్ని గంటల్లో భూమ్మీదకు చేరుకోనున్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ నుండి భూమ్మీదకు వారి ప్రయాణం జరగనుంది. ఈ ప్రయాణంలో వారికి దిశానిర్దేశం చేసేది ఎవరు? భూమ్మీదకు రావడానికి గైడ్ చేసే నావిగేషన్ ఫోర్స్ ఏంటనేదే ఒక ఆసక్తికరమైన విషయం.

సాధారణంగా ఉపగ్రహాల గురించి ఎవ్వరూ పెద్దగా ఆలోచించరు. ఏదైనా ఉపగ్రహ ప్రయోగం జరిగినప్పుడు లేదా ఉపగ్రహాల గురించి ఏవైనా వార్తలు వచ్చినప్పుడు మాత్రమే వాటి గురించి చర్చిస్తుంటారు. ఆ తరువాత వాటి గురించి ఎక్కడా పెద్దగా ప్రస్తావన రాదు. కానీ అవి లేకుండా నేల నుండి నింగి వరకు మనిషి జీవితమే లేదు. ఎందుకంటే మనిషి ప్రతీ కదలికను ఏదో ఉపగ్రహం ఏదో ఒకరకంగా శాసిస్తూనే ఉంటుంది.

వాతావరణ హెచ్చరికల నుండి ప్రమాదాలను పసిగట్టడం వరకు, మీరు ఎక్కడికి వెళ్లాలన్నా మ్యాప్స్ రూపంలో దారి చూపించడం వంటివి ఉపగ్రహాల ద్వారా అందిస్తున్న సేవలే. సాధారణంగా చాలామందికి తెలిసిన ఉపగ్రహాల సేవలు ఇవే. కానీ అంతకుమించి శాటిలైట్స్ గురించి తెలుసుకోవాల్సింది ఇంకెంతో ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

కమ్యునికేషన్ శాటిలైట్స్ :

ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో అది ప్రపంచానికి పాకిపోతోందంటే అందుకు కారణం శాటిలైట్స్. సప్తసముద్రాల అవతల జరిగే ఘటనలను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే అవకాశాన్ని కమ్యూనికేషన్ శాటిలైట్స్ కల్పిస్తున్నాయి. భూమ్మీద నుండి సిగ్నల్స్ రూపంలో శాటిలైట్స్ రిసీవ్ చేసుకుని ఆ సమాచారాన్ని తిరిగి భూమ్మీద మరో చోటికి సిగ్నల్స్ రూపంలో పంపిస్తాయి. అలా యావత్ ప్రపంచం సమాచార మార్పిడి చేసుకుంటోంది. ఇంటర్నెట్, ఫోన్స్, టీవీలు, అన్ని ఇతర డిజిటల్ డివైజెస్ ఇలానే పనిచేస్తున్నాయి.

వాతావరణ ఉపగ్రహాలు :

పంటలు పండించడంలో వాతావరణ హెచ్చరికలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. ఇంట్లోంచి బయటికి వెళ్లే ముందు కూడా వాతావరణం ఎలా ఉండనుందని చెక్ చేసే వారు ఉంటారు. ఈ సేవలన్నీ వెదర్ శాటిలైట్స్ అందిస్తుంటాయి. వాతావరణంలోని ఉష్ణోగ్రతల మార్పులు, వర్షాలు, తేమ... ఇలాంటి మార్పులన్నింటినీ ఈ శాటిలైట్స్ ముందే పసిగడుతుంటాయి.

నిఘా కోసం ఉపగ్రహాలు :

శత్రువుల కదలికలను గుర్తించేందుకు, తమ దేశ భద్రతకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు కొన్ని శాటిలైట్స్ పనిచేస్తుంటాయి. అడవుల నరికివేత, సరిహద్దుల్లో శత్రువుల కదలికలు, సముద్రం అట్టడుగు రహస్యాలు వంటి వాటిని ఈ నిఘా నేత్రాలు పసిగడుతుంటాయి. సంబంధిత శాఖలు, విభాగాల అధికారులు ఆ సమాచారాన్ని సేకరించి తమ అధికారిక అవసరాలకు అనుగుణంగా వాడుకుంటారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పండించడం ఎక్కువగా జరుగుతోంది. దట్టమైన అడవుల్లో క్షేత్రస్థాయిలో నిఘా పెట్టడం కష్టం అవుతుండటంతో పోలీసులు శాటిలైట్ సేవలపై ఆధారపడుతున్నారు. గంజాయి పంటలను శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తించి ఆయా ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు.

అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఇంకొకటుంది. శాటిలైట్ కంటికి చిక్కకుండా ఉండటం కోసం ఇప్పుడు గంజాయి దొంగలు మిశ్రమ పంటలను పండిస్తున్నారు. అంటే గంజాయి పంటల మధ్య ఇతర పంటలు వేయడం అన్నమాట. దీనినే మిక్స్‌డ్ ఫార్మింగ్ అని పోర్ట్‌ఫోలియో ఫార్మింగ్ అని కూడా అంటుంటారు.

నావిగేషన్ శాటిలైట్స్ :

మనం ఎక్కడున్నామో మనకు తెలియకపోయినా మన చేతిలో ఉన్న ఫోన్‌కు కచ్చితంగా తెలుస్తుంది. లొకేషన్ ఆన్ చేయగానే ఎక్కడున్నామో ఊరిపేరు, వీధి పేరుతో సహా చూపిస్తుంది. మనం ఎక్కడికి వెళ్లాలో చెబితే అక్కడికి ఎడమ వైపు తిరుగండి, కుడివైపు తిరగండి అని చెప్పి మరీ తీసుకెళ్తుంది. అదెలా అంటే, నావిగేషన్ శాటిలైట్స్ వల్లే అది సాధ్యం అవుతోంది.

డయల్ 100, 108 అంబులెన్స్ సేవల నుండి ఓలా, ఉబర్, జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో వరకు నావిగేషన్ సేవలన్నీ జీపీఎస్ టెక్నాలజీ ద్వారానే అందుతున్నాయి. నావిగేషన్ శాటిలైట్స్ ద్వారానే జీపీఎస్ సిస్టం పనిచేస్తుంది.

భూ గ్రహాన్ని అధ్యయనం చేసే శాటిలైట్స్

కొన్ని శాటిలైట్స్ భూగ్రహాన్ని అధ్యయనం చేస్తుంటాయి. నింగి, నేల, సముద్రంలో నీటి మట్టం పెరగడం, తగ్గడం, వాతావరణంలో మార్పులు, కాలుష్యం, ప్రకృతి విపత్తులను అంచనా వేస్తుంటాయి. ఆ సమాచారం ఆధారంగానే శాస్త్రవేత్తలు ప్రపంచానికి ఉపయోగపడే ప్రయోగాలు చేస్తుంటారు.

విశ్వంలో అద్భుతాలను చూపించే శాటిలైట్స్:

భూ గ్రహం లాంటి గ్రహం మరొకటి ఉందా అనే ప్రయోగాలు ఎప్పటి నుండో నడుస్తున్నాయి. మరో గ్రహంపై నీటి జాడలు ఉన్నాయా? ఆక్సీజన్ లభిస్తుందా? మనిషి మనుగడకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా అనే అధ్యయనాలు జరుగుతున్నాయి. అందుకోసం ఖగోళ శాస్త్రవేత్తలు అదే పనిగా విశ్వం మొత్తం జల్లెడ పడుతున్నారు. ఆ అద్భుతాలను చూసేందుకు హబుల్ స్పేస్ టెలిస్కోప్, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి వాటి సాయంతో పరిశోధనలు కొనసాగిస్తున్నారు. శాటిలైట్స్ ద్వారానే ఇలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి.

సముద్రం అట్టడుగులో పరిశోధనలు చేయాలనుకున్నా... చంద్రుడిపై అడుగుపెట్టాలనుకున్నా, విశ్వంలో మానవుడి రెటినాకు కనిపించని అద్భుతాలను చూడాలనుకున్నా శాటిలైట్స్ సేవలు ఎంతో ముఖ్యం. భవిష్యత్ అంతా శాటిలైట్ సేవలదే. అందుకే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ లాంటి వారు కూడా స్పేస్ఎక్స్ లాంటి సంస్థలను స్థాపించి ప్రైవేటుగా అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు.

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో చిక్కుకున్న సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను భూమ్మీదకు తీసుకొస్తున్న స్పేస్ఎక్స్ క్యాప్సూల్ కూడా ఇలా అన్ని శాటిలైట్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించుకుంటూ భూమ్మీదకు నావిగేట్ అవుతుంది. 17 గంటల ప్రయాణం తరువాత అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ఎక్స్ డ్రాగాన్ క్యాప్సూల్ ల్యాండ్ అవుతుంది. అక్కడి నుండి షిప్ ద్వారా వారిని ఒడ్డుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories