Spam Calls: స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ విధంగా నిరోధించండి..!

Troubled By Spam Calls Prevent It This Way
x

Spam Calls: స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఈ విధంగా నిరోధించండి..!

Highlights

Spam Calls: చాలాసార్లు మనం బిజీగా ఉన్న సమయంలో స్పామ్‌ కాల్స్, మెస్సేజ్‌లు ఇబ్బందిపెడుతాయి. ఇలాంటి వాటిని కొన్ని ట్రిక్‌లు పాటించి నివారించవచ్చు.

Spam Calls: చాలాసార్లు మనం బిజీగా ఉన్న సమయంలో స్పామ్‌ కాల్స్, మెస్సేజ్‌లు ఇబ్బందిపెడుతాయి. ఇలాంటి వాటిని కొన్ని ట్రిక్‌లు పాటించి నివారించవచ్చు. మీరు SMS ద్వారా లేదా యాప్ ద్వారా ఇలాంటి కాల్స్, మెస్సేజ్‌లు రాకుండా నిరోధించవచ్చు. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

ముందుగా మొబైల్‌లోని మెసేజ్ బాక్స్‌లోకి వెళ్లి 1909కి బ్లాక్ చేయండి అని మెసేజ్ పంపాలి. వెంటనే మీకు మరో మెసేజ్ వస్తుంది. అందులో మీ Airtel/Jio/Vi మొబైల్ నంబర్ ఎంటర్‌ చేసి , ఎలాంటి రకం కాల్స్‌ వద్దనుకుంటున్నారో తెలపాలి. 24 గంటల్లో స్పామ్ కాల్స్‌ నిలిపివేస్తారు. మరొక పద్దతి రిలయన్స్ జియో, Airtel, Vodafone Idea కంపెనీ వినియోగదారులు వర్తిస్తుంది.

Jio DND యాక్టివేట్ చేయండి

ముందుగా మీరు My Jio యాప్‌ని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత యాప్‌ ఓపెన్ చేసి సెట్టింగ్‌లకు వెళ్లండి. ఇందులో సర్వీస్ సెట్టింగ్‌లలో డోంట్ డిస్టర్బ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు వివిధ వర్గాలను చూస్తారు. ఏ వర్గం కోసం DND (డిస్టర్బ్ చేయవద్దు) యాక్టివేట్‌ చేయాలనుకుంటున్నారో ఎంచుకొని యాక్టివేట్‌ చేయాలి.

Airtel DNDని ఇలా యాక్టివేట్ చేయండి

మీరు ఎయిర్‌టెల్ వినియోగదారు అయితే airtel.in/airtel-dndకి వెళ్లండి. ఈ సైట్‌లో ముందుగా మీ ఎయిర్‌టెల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత మీ నంబర్‌కు OTP వస్తుంది. OTPని ఎంటర్ చేసిన తర్వాత మీరు బ్లాక్ చేయాలనుకున్న వర్గాలను ఎంచుకుంటే సరిపోతుంది.

Vi DNDని ఇలా యాక్టివేట్ చేయండి

మీరు Vodafone Idea వినియోగదారు అయితే Discover.vodafone.in/dndకి వెళ్లండి. తర్వాత మొబైల్ నంబర్, ఈ మెయిల్ ID, పేరును ఎంటర్‌ చేయాలి. తర్వాత మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న వర్గాలను ఎంచుకొని ఓకె చేస్తే చాలు.

Show Full Article
Print Article
Next Story
More Stories