TRAI New Rules: మొబైల్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇక నుంచి అవన్నీ బ్లాక్..!

TRAI New Rules
x

TRAI New Rules

Highlights

TRAI New Rules: నవంబర్ 1, 2024 నుంచి రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea), BSNLకు కోసం కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. కానీ ఇప్పుడు ఈ తేదీని డిసెంబర్ 1, 2024 వరకు పొడిగించారు.

TRAI New Rules: స్కామర్లు, మోసగాళ్లను ఆపడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక రూల్స్ అమలు చేస్తోంది. వాస్తవానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా స్పామ్ మెసేజెస్, కాల్‌లు, ఓటీటీలను ఆపడానికి చర్యలు తీసుకోవాలని, నిబంధనలను అనుసరించాలని టెలికాం ఆపరేటర్లను నిరంతరం ఆదేశిస్తోంది.

నవంబర్ 1, 2024 నుంచి రిలయన్స్ జియో (Reliance Jio), ఎయిర్టెల్ (Airtel), వొడాఫోన్ ఐడియా (Vodafone Idea), బీఎస్ఎన్‌ఎల్‌కు కోసం కొత్త నియమాలు అమలులోకి రానున్నాయి. కానీ ఇప్పుడు ఈ తేదీని డిసెంబర్ 1, 2024 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో కొత్త నియమాలు ఏమిటి? మోసగాళ్లు ఎలా నియంత్రిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రాయ్ (TRAI) కొత్త నిబంధనలు డిసెంబర్ 1 నుండి అమలులోకి రానున్నాయి. దీని కింద, అన్ని లావాదేవీలు, సర్వీస్ మెసేజెస్, ట్రేసబిలిటీ రికార్డులు అన్ని బ్యాంకులు, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, ఆర్థిక సంస్థల కింద పనిచేస్తాయి. ట్రేస్బిలిటీ నియమాలకు అనుగుణంగా బిజినెస్ మెసేజస్ కూడా వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP)ని కలిగి ఉంటాయి. నిబంధనలను అనుసరించి సందేశాలు పంపకపోతే, అవి బ్లాక్ అవుతాయి. వీటిలో ఓటీపీ మెసేజస్ కూడా ఉంటాయి.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా టెలికాం ఆపరేటర్లకు మరో నెల సమయం ఇచ్చింది. స్పెసిఫిక్ కీ వర్డ్స్ గుర్తించాల్సిందిగా టెలికాం కంపెనీలను కోరింది. కంపెనీ ఈ నంబర్లను ముందుగానే బ్లాక్ చేస్తుంది. కేవలం స్పామ్ మెసేజెస్ లేదా కాల్స్ మాత్రమే కాకుండా ఫోన్‌లోని ఓటీటీ మెసేజెస్ కూడా బ్లాక్ అవుతాయి

వినియోగదారులను ట్రాప్ చేయడానికి మెసేజెస్, లింక్‌లు పంపడం వంటి వాటిని ఆపడానికి లేదా ఓటీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడంలో కూడా ట్రాయ్ రూల్స్ అమల్లోకి వస్తాయి. ఇంతకుముందు కొత్త నిబంధన అక్టోబర్ 1 నుండి అందరికీ అమలవుతుంది. టెలిమార్కెటింగ్ కాల్‌లు, ఫేక్ మెసేజెస్, బ్లాక్‌లిస్టింగ్‌తో సహా మొబైల్ నంబర్‌లు ఇప్పటికే డిస్‌కనెక్ట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రూల్ ఇప్పుడు డిసెంబర్ 1 నుండి అందరికీ వర్తిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories