రూ.35 వేల బడ్జెట్‌లో థామ్సన్ 55 అంగుళాల QLED స్మార్ట్ టీవీ సూపర్.. డిజైన్‌, ఫీచర్లు అద్భుతం..!

Thomson 55 Inch QLED Smart TV In A Budget Of Rs 35 Thousand Know About The Design Features
x

రూ.35 వేల బడ్జెట్‌లో థామ్సన్ 55 అంగుళాల QLED స్మార్ట్ టీవీ సూపర్.. డిజైన్‌, ఫీచర్లు అద్భుతం..!

Highlights

Thomson 55 Inch QLED Smart TV: థామ్సన్ ఒక నెల క్రితం 55 అంగుళాల స్క్రీన్‌తో QLED అల్ట్రా HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీని విడుదల చేసింది.

Thomson 55 Inch QLED Smart TV: థామ్సన్ ఒక నెల క్రితం 55 అంగుళాల స్క్రీన్‌తో QLED అల్ట్రా HD (4K) స్మార్ట్ గూగుల్ టీవీని విడుదల చేసింది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 ప్లస్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ టీవి కొనుగోలు చేసినప్పుడు పెట్టెలో టీవీతో పాటు రిమోట్, దానికి సంబంధించిన రెండు బ్యాటరీలు, వాల్ మౌంట్ స్టాండ్, టేబుల్‌పై ఉంచే స్టాండ్, స్పీకర్లను కనెక్ట్ చేసే వైర్ల సెట్, యూజర్ మాన్యువల్ వస్తాయి. తక్కువ ధరలో లభించే అతి పెద్ద స్క్రీన్ టీవీ ఇదే. ఈ టీవీ డిజైన్ సరళమైనది క్లాస్‌గా ఉంటుంది. టీవీ దిగువన థామ్సన్ లోగో ఉంటుంది. ఇందులో దిగువ, వెనుక భాగంలో పెన్ డ్రైవ్, HDMI కేబుల్ టైప్ వస్తువులను కనెక్ట్ చేసే ఆప్షన్స్‌ ఉంటాయి.

ఇది QLED TV కాబట్టి 4K రిజల్యూషన్, HDR10 ప్లస్ సపోర్ట్, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్, రిఫ్రెష్ రేట్ 60 Hz తో వచ్చింది. దీని రంగు బ్యాక్‌లైట్, పిక్చర్ కాంట్రాస్ట్ కూడా బాగున్నాయి. ఈ టీవీతో ఇన్-బిల్ట్ స్పీకర్లు అందించారు. మీరు హాయిగా పాటలు వినవచ్చు లేదా వీడియోలను చూడవచ్చు. మరింత సౌండ్‌ కోసం వైర్‌లెస్ స్పీకర్‌లకు కనెక్ట్ చేయవచ్చు. ఈ స్మార్ట్ టీవీలో 2GB RAM, 16GB స్టోరేజ్ ఉంటుంది. వైఫైకి కనెక్ట్ చేయడం ద్వారా ఆన్‌లైన్ స్ట్రీమింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఈ Google TVని సెటప్ చేయడం చాలా సులభం.

ఈ టీవీ రిమోట్‌లో కొన్ని షార్ట్‌కట్ బటన్‌లు ఉన్నాయి. ఇది ప్రైమ్ వీడియో, యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ కోసం ప్రత్యేక బటన్‌లను కలిగి ఉంది. వీటి సహాయంతో ఈ యాప్‌లను సెకన్లలో ఓపెన్‌ చేయవచ్చు. ఈ టీవీ వాయిస్ కమాండ్ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎవరికైనా ఎక్కువ టెక్నికల్ విషయాలు తెలియకపోతే మాట్లాడి కమాండ్‌ చేయవచ్చు. రూ. 33,999 వద్ద లభించే 55-అంగుళాల థామ్సన్ టీవీ మంచి డీల్ అని చెప్పవచ్చు. దీని పరిమాణం ప్రకారం బరువు కూడా తక్కువగా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories