Bikes: ఈ నాలుగు బైక్‌లు ధర తక్కువ మైలేజ్‌ ఎక్కువ..!

These four bikes have low price and high mileage
x

Bikes: ఈ నాలుగు బైక్‌లు ధర తక్కువ మైలేజ్‌ ఎక్కువ..!

Highlights

Bikes: ఈ నాలుగు బైక్‌లు ధర తక్కువ మైలేజ్‌ ఎక్కువ..!

Bikes: పెట్రోల్-డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది చౌకైన, సరసమైన బైక్‌ల కోసం చూస్తున్నారు. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు అస్తవ్యస్తంగా ఉంది. కానీ ఈ నాలుగు బైక్‌లు ధర తక్కువ మైలేజీ ఎక్కువ ఇస్తాయి. మధ్యతరగతి కుటుంబాలకి చేదోడు వాదోడుగా ఉంటున్నాయి. ధర కేవలం రూ.50,000 నుంచి 60,000 వరకు ఉంటుంది. వీటి మైలేజ్ మిగతా వాటితో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది.

బజాజ్ CT 100

CT 100 అనేది ఎలక్ట్రిక్ స్టార్ట్‌తో వస్తున్న చౌకైన బైక్. ముంబైలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 52,510, ఇది టాప్ మోడల్‌కు రూ. 60941 వరకు ఉంటుంది. ఈ బైక్‌ను రూ.50,000 లోపు అత్యుత్తమ బడ్జెట్ బైక్‌లలో చేర్చారు. దీనికి 102 సిసి ఇంజన్ ఇచ్చారు. ఒక లీటర్ పెట్రోల్‌తో ఈ బైక్‌ని 90 కి.మీ వరకు నడపవచ్చు.

TVS స్పోర్ట్

TVS స్పోర్ట్ మంచి ఫీచర్లతో కూడిన స్టైలిష్ బైక్. ఇది 7.8 PS పవర్, 7.5 Nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 99.7 cc ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజన్ 4-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. బైక్ ముందు భాగం టెలిస్కోపిక్ ఫోర్క్‌లతో, వెనుక భాగం ట్విన్ షాక్ అబ్జార్బర్‌లతో వస్తుంది. ఈ బైక్‌ను 1 లీటర్ పెట్రోల్‌లో 75 కి.మీ వరకు నడపవచ్చు. ముంబైలో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 57,967 నుంచి మొదలై రూ. 63,176 వరకు ఉంది.

హీరో HF డీలక్స్

ఈ బైక్ ఇండియన్ మార్కెట్లో దూసుకుపోతుంది. ఇది 5 వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్ 8.36 PS పవర్, 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే 97.2 cc ఇంజన్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్‌ 1 లీటర్ పెట్రోల్‌లో 82.9 కి.మీ వరకు నడపవచ్చు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర ముంబైలో రూ.52,040 నుంచి మొదలై రూ.62,903 వరకు ఉంటుంది. దీనితో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, 5-స్పోక్ అల్లాయ్ వీల్స్, హెడ్‌లైట్ ఆన్ వంటి ఫీచర్లు అందించారు.

బజాజ్ ప్లాటినా 100

బజాజ్ ప్లాటినా 100 కూడా అత్యంత సరసమైన బైక్‌లలో ఒకటి. ఇది మొదట 2005లో ప్రారంభించారు. కంపెనీ ఇప్పటివరకు 5 లక్షల యూనిట్లను విక్రయించింది. ఈ బైక్ కిక్-స్టార్ట్, ఎలక్ట్రిక్-స్టార్ట్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 52,861, ఇది టాప్ మోడల్‌కు రూ. 63,541 వరకు ఉంటుంది. బైక్‌కి 102 సిసి ఇంజన్ ఇచ్చారు. 1 లీటర్ పెట్రోల్‌కి ఈ బైక్‌ని 90 కిమీ వరకు నడపవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories