iPhone: భారతీయులు ఇష్టపడి కొంటున్న ఐఫోన్‌ ఏంటో తెలుసా..?

These are the Top Selling Phones in India According to Economic Survey 2023-24
x

iPhone: భారతీయులు ఇష్టపడి కొంటున్న ఐఫోన్‌ ఏంటో తెలుసా..?

Highlights

iPhone: యాపిల్‌ ప్రొడక్ట్స్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

iPhone: యాపిల్‌ ప్రొడక్ట్స్‌కు ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఈ ఫోన్‌కు ఇంతటి క్రేజ్‌ తీసుకొచ్చిందని తెలిసిందే. మార్కెట్లోకి యాపిల్‌ నుంచి కొత్త ఐఫోన్‌ వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా బజ్‌ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే భారత్‌లో ఐఫోన్‌ల పరిస్థితిల ఎలా ఉంది..? అసలు భారతీయులు ఎంత మంది ఐఫోన్స్‌ కొనుగోలు చేస్తున్నారు. లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2023-24 ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం ప్రపంచంలో అమ్ముడవుతున్న మొత్తం ఐఫోన్లలో మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ వాటా కేవలం ఒక శాతం మాత్రమే. అదే సమయంలో, ఐఫోన్ ఎగుమతి పరంగా భారతదేశం నాలుగు స్థానాలకు పెరిగింది. 2024 మార్చి నాటికి భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్‌లలో ఐఫోన్‌15, ఐఫోన్‌14లు ఉన్నాయి. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఐఫోన్‌లలో ఈ రెండు మోడల్స్‌కు అత్యధికంగా డిమాండ్‌ ఉంది.

ఐడీసీ నివేదిక ప్రకారం.. భారత్‌లో ఐఫోన్‌ షిప్‌మెంట్ గతేడాదితో పోలిస్తే 19 నుంచి 20 శాతం పెరిగింది. దీంతో భారత్‌ యాపిల్‌ ఫోన్‌ల అమ్మకాల్లో 4వ స్థానంలో నిలిచిది. ఈ సమయంలో ఎగుమతుల్లో 24 శాతం వృద్ధి సాధించింది. ప్రస్తుతం భారత్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్ ఫోన్‌ల తయారీ జరుగుతోంది. అయితే ప్రో మోడల్స్‌, ప్రో మ్యాక్స్‌ చైనాలో తయారవుతున్నాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ అమ్మకాలు నష్టాలను చూస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ $90.7 బిలియన్ల ఆదాయాన్ని పొందింది. ఇది గత సంవత్సరం $94.8 బిలియన్ల కంటే తక్కువ. అదే సమయంలో, ఐఫోన్ ఆదాయం $51.33 బిలియన్ల నుంచి $45.9 బిలియన్లకు తగ్గింది.

Show Full Article
Print Article
Next Story
More Stories