Budget 5G Smartphones: బడ్జెట్‌లో వచ్చే 5 జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. పెద్ద డిస్‌ప్లే, బ్యాటరీ ఇంకా మరెన్నో..!

These Are The Budget 5G Smartphones Big Display Battery And Much More
x

Budget 5G Smartphones: బడ్జెట్‌లో వచ్చే 5 జీ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. పెద్ద డిస్‌ప్లే, బ్యాటరీ ఇంకా మరెన్నో..!

Highlights

Budget 5G Smartphones: ప్రస్తుతం 5జి స్మార్ట్‌ఫోన్‌ ట్రెండ్‌ నడుస్తోంది. యువత 4జి వదిలేసి 5జి వైపు పరుగులు పెడుతున్నారు.

Budget 5G Smartphones: ప్రస్తుతం 5జి స్మార్ట్‌ఫోన్‌ ట్రెండ్‌ నడుస్తోంది. యువత 4జి వదిలేసి 5జి వైపు పరుగులు పెడుతున్నారు. చాలామంది తక్కువ బడ్జెట్‌లో వచ్చే 5జి స్మార్ట్‌ ఫోన్స్‌ గురించి వెతుకుతున్నారు. అయితే ఇప్పుడు చాలా కంపెనీలు బడ్జెట్లో వచ్చే 5జి స్మార్ట్‌ఫోన్లను విడుదల చేశాయి. ఇందులో బెస్ట్‌ వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

Samsung Galaxy M13

శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎమ్‌ 13 ధర రూ.13,380 నుంచి ప్రారంభమవుతుంది. ఫోన్ 6.6-అంగుళాల FHD+ డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్ (50MP+5MP+2MP, 8MP ఫ్రంట్ కెమెరా) అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది.

Redmi 12 5G

రెడ్‌మి 12 5జి ధర రూ.12,999 నుంచి ప్రారంభమ వుతుంది. ఫోన్ Snapdragon 4 Gen 2 ద్వారా శక్తిని పొందుతుంది. 6.79 అంగుళాల FHD+ 90Hz డిస్‌ప్లే అందుబాటులో ఉంది. ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 50MP డ్యూయల్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఉన్నాయి.

POCO M6 Pro 5G

పోకో ఎమ్‌ 6 ప్రో 5జి ధర రూ.10,999 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఫోన్ 6.7 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్‌లో 5000mAh బ్యాటరీ, 50MP + 2MP, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

Lava Blaze 5G

లావా బ్లేజ్‌ 5జి ధర రూ.11,208 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ 6.5 అంగుళాల HD+ 90Hz IPS డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, 50MP కెమెరా, MediaTek Dimensity 700 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Infinix HOT 20 5G

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 20 5జి ధర రూ.12,999 నుంచి ప్రారంభమవుతుంది. ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 5000 mAh బ్యాటరీ, 50MP + AI లెన్స్, 8MP ఫ్రంట్ కెమెరా, డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories