UPI Limit Increase: లిమిట్ పెరిగింది.. రూ.5 లక్షల వరకు యూపీఐ చెల్లింపులు..!

UPI Limit Increase
x

UPI Limit Increase

Highlights

UPI Limit Increase: పన్ను చెల్లింపు కోసం యూనిఫైట్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ట్రాన్సాక్షన్ లిమిట్ 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రకటించింది.

UPI Limit Increase: పన్ను చెల్లింపు కోసం యూనిఫైట్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ట్రాన్సాక్షన్ లిమిట్ 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇటీవల ప్రకటించింది. గత వారం జరిగిన ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇప్పుడు మీరు రూ. లక్షల వరకు పన్ను చెల్లించవచ్చు. ఇంతకుముందు ఈ లిమిట్ రూ.1 లక్ష ఉండగా ఇప్పుడు దీన్ని రూ. 5లక్షలకు పెంచింది.

ఇది కాకుండా UPIలో డెలిగేటెడ్ చెల్లింపు సౌకర్యాన్ని అందించాలని సెంట్రల్ బ్యాంక్ ప్రతిపాదించింది. ఈ సదుపాయం కింద ఒక వ్యక్తి తన బ్యాంక్ ఖాతా నుండి నిర్దిష్ట పరిమితి వరకు UPI ద్వారా చెల్లింపు చేయడానికి మరొక వ్యక్తికి అనుమతి ఇవ్వవచ్చు. అంటే UPI వినియోగదారులు తన ఖాతా నుండి ఏ ఇతర వ్యక్తికైనా చెల్లింపు చేసే హక్కును ఇవ్వగలరు.

ఈ మార్పు ద్వారా పన్ను పరిష్కారం కోసం డిజిటల్ చెల్లింపులను పాపులర్ చేయాలని సెంట్రల్ బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ. 5,00,000 పరిమితితో ఇప్పుడు అధిక పన్ను చెల్లించే వ్యక్తులు కూడా UPI ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ల వంటి పద్ధతులతో పోలిస్తే UPIని ఉపయోగించడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే అదనపు ప్రాసెసింగ్ ఫీజులు లేవు.

చాలా సందర్భాలలో UPI ట్రాన్సాక్షన్ లిమిట్ ప్రతి లావాదేవీకి రూ. 1,00,000గా ఉంది. అయితే కొన్ని వర్గాలు అధిక పరిమితులలో లావాదేవీలను అనుమతిస్తాయి. ఉదాహరణకు క్యాపిటల్ మార్కెట్, బీమాలో చెల్లింపు కోసం లావాదేవీ పరిమితి రూ. 2,00,000. ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)లో, రూ. 5,00,000 వరకు లావాదేవీలు జరుగుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories