iPhone 16e First Sale Today: ఫస్ట్ సేల్ మొదలవుతుంది.. ఐఫోన్ 16ఈ.. డీల్స్ మతిపోగుతున్నాయ్..!

iPhone 16e First Sale Today
x

iPhone 16e First Sale Today: ఫస్ట్ సేల్ మొదలవుతుంది.. ఐఫోన్ 16ఈ.. డీల్స్ మతిపోగుతున్నాయ్..!

Highlights

iPhone 16e First Sale Today: ఈరోజు ఫిబ్రవరి 28 నుండి ఐఫోన్ 16e దేశంలో మొదటిసారిగా సేల్‌కి రానుంది.

iPhone 16e First Sale Today: ఐఫోన్ ప్రియులకు ఓ తీపి వార్త. ఐఫోన్ 16ఈ మొబైల్ హైప్ నేటి నుంచి ప్రారంభం కానుంది. యాపిల్ ఇటీవల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న iPhone 16eని విడుదల చేసింది. ఈరోజు ఫిబ్రవరి 28 నుండి ఐఫోన్ 16e దేశంలో మొదటిసారిగా సేల్‌కి రానుంది. మీరు ఈ యాపిల్ ఫోన్‌ను చాలా తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. మొదటి సేల్‌పై కంపెనీ రూ.10,000 వరకు తగ్గింపును అందిస్తోంది. రండి.. ఈ కొత్త iPhone 16e ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.

iPhone 16e Offers

ఐఫోన్ 16e మొబైల్ ప్రారంభ ధర రూ. 59,990. ఫోన్ 128GB స్టోరేజ్ వేరియంట్‌పై మొదటి సేల్‌లోరూ.4,000 తగ్గింపును అందిస్తోంది. ICICI బ్యాంక్ కస్టమర్లందరకి ఈ తగ్గింపు లభిస్తుంది. ఏదైనా ICICI బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా iPhone 16e కొనుగోలుపై 4,000 ఫ్లాట్ తగ్గింపు ఇస్తున్నారు.

అంతే కాకుండా మీ పాత మొబైల్‌ని మార్చుకుంటే కంపెనీ మీకు రూ. 6,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా ఇస్తుంది. అలానే ఈ మొబైల్‌ని కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొంటే రూ .4000 తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఐఫోన్ భారత్, యూఎస్ఏ, యూకే జపాన్, యూఏఈ, మలేషియా, చైనా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతో సహా మొత్తం 59 దేశాల్లో విక్రయించనుంది.

iPhone 16e Features And Specifications

iPhone 16e మొబైల్‌లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. ఇది అంతర్నిర్మిత OLED ప్యానెల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 800 నిట్స్ పీక్ మరియు 1200 నిట్‌ల HDR బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ iPhone 16e డిస్‌ప్లే 460ppiని సపోర్ట్ చేస్తుంది. కొత్త ఐఫోన్ 16e ఫోన్‌లో శక్తివంతమైన యాపిల్ A18 ప్రాసెసర్ ఉంది. ఇదే ప్రాసెసర్ ఐఫోన్ 16లో కూడా అందుబాటులో ఉంది. ఇది మృదువైన, వేగవంతమైన మల్టీ టాస్కింగ్‌‌ను అందిస్తుంది.

ఐఫోన్ 16e స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. ప్రత్యేకంగా, ఈ లెన్స్ యాపిల్ ఇమేజింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. ఇందులో 2x టెలిఫోటో లెన్స్. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఐఫోన్‌లో 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఐఫోన్ బ్యాటరీ గురించి ఎటువంటి సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే ఈ ఐఫోన్ ఫుల్ ఛార్జింగ్ తర్వాత 26 గంటల పాటు పనిచేస్తుంది. ఈ ఐఫోన్‌లో వైర్‌లెస్ Qi ఛార్జింగ్ కూడా ఉంది. ఈ కొత్త ఐఫోన్‌లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories