TECNO POVA Curve 5G Launched: రూ.57లకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గెలిచే ఛాన్స్.. ఏంట్రా బాబు ఈ ఆఫర్లు..!

TECNO POVA Curve 5G Launched
x

TECNO POVA Curve 5G Launched: రూ.57లకే కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ గెలిచే ఛాన్స్.. ఏంట్రా బాబు ఈ ఆఫర్లు..!

Highlights

TECNO POVA Curve 5G Launched: టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ POVA కర్వ్ 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ జూన్ 5 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

TECNO POVA Curve 5G Launched: టెక్నో తన కొత్త స్మార్ట్‌ఫోన్ POVA కర్వ్ 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ జూన్ 5 నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. బేస్ మోడల్ 6GB+128GB వేరియంట్ ధర రూ.15,999 కాగా, 8GB+128GB వేరియంట్ ధర రూ.16,999. కంపెనీ ఈ ఫోన్‌ను బడ్జెట్ అనుకూలమైన రీతిలో, గొప్ప ఫీచర్లతో విడుదల చేసింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

TECNO POVA Curve 5G Specifications

ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద ఫీచర్ దాని 6.78-అంగుళాల 144Hz 3D కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లే, ఇది 1300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 2304Hz PWM డిమ్మింగ్ సపోర్ట్‌తో వస్తుంది. పనితీరు పరంగా, ఇది మీడియాటెకక్ డైమెన్సిటీ 7300 అల్టిమేట్ ప్రాసెసర్‌‌తో పనిచేస్తుంది, దీనితో 8జీబీ వరకు ర్యామ్, 8జీబీ వర్చువల్ ర్యామ్ సపోర్ట్ లభిస్తుంది.

కెమెరా విభాగంలో సోనీ IMX682 సెన్సార్‌తో కూడిన 64MP మెయిన్ కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. IP64 రేటింగ్‌ను కూడా ఉంది, ఇది దుమ్ము, టి నుండి రక్షిస్తుంది.

టోక్నో కర్వ్ 5G భారీ 5500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, దీనిని బాక్స్‌లో వచ్చే 45W ఛార్జర్‌ని ఉపయోగించి కేవలం 45 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. గేమింగ్ ఆడుతున్నప్పుడు బ్యాటరీ వేడెక్కకుండా నిరోధించడానికి బైపాస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంది.

లాంచ్ ఆఫర్ కింద, కొనుగోలుదారులు రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ లేదా స్కూటర్‌ను గెలుచుకునే అవకాశాన్ని పొందవచ్చు. దీనితో పాటు, ఉచిత స్క్రీన్ రీప్లేస్‌మెంట్, 10 నెలల నో కాస్ట్ EMI (రోజుకు రూ.57), పొడిగించిన వారంటీ వంటి ఆఫర్‌లు కూడా అందిస్తున్నారు.

టెక్నో ఈ ఫోన్‌ను మ్యాజిక్ సిల్వర్, నియాన్ సియాన్, గీక్ బ్లాక్ కలర్ వేరియంట్లలో విడుదల చేసింది. మీకు నచ్చిన విధంగా రంగును ఎంచుకోవచ్చు. 8జీబీ ర్యామ్ మోడల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా అందుబాటులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories