Smartphone Cleaning: స్మార్ట్‌ఫోన్‌ డీప్‌ క్లీనింగ్‌ చిట్కాలు.. మూలలో దాగిన దుమ్ము మొత్తం బయటికి..!

Smartphone Deep Cleaning Tips All The Dust Hidden In The Corner Will Come Out
x

Smartphone Cleaning: స్మార్ట్‌ఫోన్‌ డీప్‌ క్లీనింగ్‌ చిట్కాలు.. మూలలో దాగిన దుమ్ము మొత్తం బయటికి..!

Highlights

Smartphone Cleaning: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. దీంతో అన్ని పనులని ఆన్‌లైన్‌ ద్వారా సులువుగా చేస్తున్నారు.

Smartphone Cleaning: ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటుంది. దీంతో అన్ని పనులని ఆన్‌లైన్‌ ద్వారా సులువుగా చేస్తున్నారు. దీనివల్ల ఎంతో సమయం ఆదా అవుతుంది. కానీ ఇంత ఉపయోగపడుతున్న ఫోన్‌ని మాత్రం సరిగ్గా పట్టించుకోరు. దీంతో ఇది కొంత కాలానికి దుమ్ము పట్టి పాడైపోతుంది. దీంతో మళ్లీ డబ్బులు పెట్టి కొత్తది కొనుగోలు చేయాలి. ఈ పరిస్థితి రావొద్దంటే స్మార్ట్‌ఫోన్‌ని తరచుగా క్లీన్‌ చేస్తూ ఉండాలి. అయితే అది ఏ విధంగా చేయాలో ఈ రోజు తెలుసుకుందాం.

చాలా మంది భారతీయులు స్మార్ట్‌ఫోన్‌లని తొందరగా మార్చరు. సంవత్సరాలు సంవత్సరాలు ఉపయోగిస్తారు. అయితే ఫోన్‌ను క్లీన్ చేసే విషయంలో తప్పులు చేస్తారు. ఏదో ఫోన్‌ని పైపైన మాత్రమే తుడుస్తారు కానీ డీప్ క్లీన్ చేయరు. దీంతో ఫోన్ సమయానికి ముందే పాడైపోతుంది. ఛార్జింగ్ పోర్ట్ సరిగ్గా పని చేయదు దీంతో ఛార్జింగ్ వేగం తగ్గుతుంది. స్పీకర్‌ దగ్గర దుమ్ము ఉండటం వల్ల వాల్యూమ్ తగ్గుతుంది. అందుకే అప్పుడప్పుడు ఫోన్‌ని డీప్‌ క్లీన్‌ చేయాలి.

ఇయర్‌బడ్‌లను ఉపయోగించవచ్చు

మీరు స్మార్ట్‌ఫోన్‌ని డీప్‌గా క్లీన్ చేయడానికి లోపలి భాగాలని శుభ్రం చేయడానికి కాటన్ ఇయర్‌బడ్‌లను ఉపయోగించవచ్చు. వీటి సాయంతో స్మార్ట్‌ఫోన్‌లోని ఛార్జింగ్ పోర్ట్‌తో పాటు కెమెరా, స్పీకర్ గ్రిల్‌ను సులభంగా శుభ్రపరచవచ్చు.

మైక్రోఫైబర్ క్లాత్

స్మార్ట్‌ఫోన్‌ని ఏ క్లాత్‌తో పడితే ఆ క్లాత్‌తో తుడవకూడదు. దీనివల్ల ఫోన్‌ డిస్‌ప్లేపై గీతలు పడుతాయి. స్మార్ట్‌ఫోన్‌ను ఉత్తమంగా శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ క్లాత్‌ని ఉపయోగించాలి. దీనికి కారణం ఇది చాలా మృదువుగా ఉంటుంది. ఇది స్మార్ట్‌ఫోన్ బాడీకి ఎటువంటి హాని కలిగించదు. మెరుగైన శుభ్రతను అందిస్తుంది. ఈ క్లాత్‌ను ఉపయోగించడం వల్ల ఫోన్‌కి ఎలాంటి నష్టం ఉండదు. ఈ మైక్రోఫైబర్ క్లాత్‌ని మార్కెట్ నుంచి రూ.100 లేదా రూ.150 పెట్టి సులభంగా కొనుగోలు చేయవచ్చు

Show Full Article
Print Article
Next Story
More Stories