ONDC: అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌కు పోటీ ఇస్తున్న చిన్న వ్యాపారులు.. ప్రభుత్వ సాయంతో పెరిగిన ఆదాయం..!

ONDC : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌కు పోటీ ఇస్తున్న చిన్న వ్యాపారులు.. ప్రభుత్వ సాయంతో పెరిగిన ఆదాయం
x

ONDC : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ల‌కు పోటీ ఇస్తున్న చిన్న వ్యాపారులు.. ప్రభుత్వ సాయంతో పెరిగిన ఆదాయం

Highlights

ONDC : కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఓపెన్ నెట్‌వ‌ర్క్ ఫ‌ర్ డిజిట‌ల్ కామ‌ర్స్ (ఓఎన్‌డీసీ) చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారుల‌కు (ఎంఎస్‌ఎంఈ) నిజంగా ఒక గేమ్ ఛేంజ‌ర్‌లా మారింది.

ONDC : కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన ఓపెన్ నెట్‌వ‌ర్క్ ఫ‌ర్ డిజిట‌ల్ కామ‌ర్స్ (ఓఎన్‌డీసీ) చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా వ్యాపారుల‌కు (ఎంఎస్‌ఎంఈ) నిజంగా ఒక గేమ్ ఛేంజ‌ర్‌లా మారింది. పేమెంట్ సొల్యూష‌న్ కంపెనీ అయిన ఈజీ పే త‌జా రిపోర్ట్ ప్ర‌కారం, ఓఎన్‌డీసీలో చేరిన ఎంఎస్‌ఎంఈ వ్యాపారుల ఆదాయం స‌గ‌టున 20 శాతం పెరిగింద‌ట‌. ఈ పెరుగుద‌ల ముఖ్యంగా చిన్న‌, మ‌ధ్య స్థాయి న‌గ‌రాల్లో క‌నిపించింది. ఇక్క‌డే ఈ వ్యాపారులు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్ లాంటి పెద్ద ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జాల‌కు గ‌ట్టి పోటీ ఇస్తున్నారు.

ఓఎన్‌డీసీతో ఎక్కువ‌గా రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎంఎస్‌ఎంఈలు క‌లిశారు. ఈ రాష్ట్రాలు చిన్న వ్యాపారులు డిజిట‌ల్ వ్యాపారాన్ని స్వీక‌రించ‌డంలో ముందున్నాయి. గ‌త ఒక్క ఏడాదిలోనే ఈజీ పే ఓఎన్‌డీసీ వేదిక‌తో క‌లిసే ఎంఎస్‌ఎంఈల సంఖ్య‌లో భారీ పెరుగుద‌ల‌ను చూసింది. 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రం వ‌ర‌కు ఈ వేదిక ల‌క్ష‌కు పైగా వ్యాపారాల‌ను క‌లుపుతుంద‌ని కంపెనీ భావిస్తోంది. చిన్న న‌గ‌రాల వ్యాపారుల‌ను డిజిట‌ల్ ప్ర‌పంచంలో బ‌లోపేతం చేయ‌డంలో ఇది ఒక పెద్ద ముంద‌డుగు.

ఈజీ పే మేనేజింగ్ డైరెక్ట‌ర్ నిల‌య్ ప‌టేల్ మాట్లాడుతూ.. ఓఎన్‌డీసీతో త‌మ స‌హ‌కారం చిన్న న‌గ‌రాల నుంచి కూడా వ్యాపారాన్ని సులువుగా న‌డ‌ప‌వ‌చ్చ‌ని చూపిస్తుంద‌ని అన్నారు. ఈ వేదిక వ్యాపారాన్ని డెమోక్రాటిక్‌గా, డీసెంట్ర‌లైజ్‌డ్‌గా చేస్తుంది. దీని వ‌ల్ల చిన్న వ్యాపారులు కూడా పెద్ద ప్లాట్‌ఫామ్స్‌తో పోటీ ప‌డ‌గ‌లుగుతున్నారు. ఓఎన్‌డీసీ వేదిక‌పై రిటైల్‌, ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసుల‌ను ఇంటిగ్రేట్ చేసే సొల్యూష‌న్స్‌ను అందిస్తున్న మొద‌టి ఫిన్‌టెక్ కంపెనీల్లో ఈజీ పే ఒక‌టి. ఈ కంపెనీ చిన్న వ్యాపారుల‌కు డిజిట‌ల్ పేమెంట్స్‌, ఆన్‌లైన్ సేల్స్ సౌక‌ర్యాన్ని అందిస్తోంది. దీని వ‌ల్ల వారి రీచ్‌, ఆదాయం రెండూ పెరుగుతున్నాయి.

ఓఎన్‌డీసీ ఈ న‌మూనా చిన్న‌, మ‌ధ్య స్థాయి న‌గ‌రాల్లో వ్యాపారాన్ని పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఈ వేదిక ఎంఎస్‌ఎంఈల‌కు కేవ‌లం టెక్నిక‌ల్ స‌పోర్ట్ మాత్ర‌మే కాదు, వారిని పెద్ద మార్కెట్ల‌కు చేర్చ‌డంలో కూడా స‌హాయం చేస్తుంది. దీని వ‌ల్ల చిన్న వ్యాపారులు త‌మ సేల్స్‌ను పెంచుకోవ‌డ‌మే కాకుండా, డిజిట‌ల్ ఎకాన‌మీలో త‌మ‌కంటూ ఒక గుర్తింపును ఏర్ప‌రుచుకుంటున్నారు. ఈ చొర‌వ భార‌త‌దేశంలోని చిన్న వ్యాపారుల‌ను స్వ‌యం స‌మృద్ధిగా చేయ‌డానికి, గ్లోబ‌ల్ కాంపిటీష‌న్‌కు వారిని సిద్ధం చేయ‌డానికి ఒక పెద్ద ముంద‌డుగు. ఓఎన్‌డీసీ,ఈజీ పే లాంటి వేదిక‌ల స‌పోర్ట్‌తో చిన్న న‌గ‌రాల వ్యాపారులు ఇప్పుడు డిజిట‌ల్ రివ‌ల్యూష‌న్‌లో భాగ‌స్వామ్యం అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories