
భారతీయ సర్వం ఏఐ గూగుల్ జెమిని, చాట్ జీపీటీలకు పోటీగా దూసుకుపోతోంది
భారతీయ ఏఐ రంగానికి టార్చ్ బేరర్ లా సర్వం ఏఐ స్టార్తప్ దూసుకుపోతోంది. చాట్ జీపీటీ, గూగుల్ జెమినీల కంటే ధీటుగా సర్వం ఏఐ పనితీరు ఉందని నిపుణులు అంటున్నారు
ఏఐ ప్రపంచంలో భారతదేశం నెమ్మదిగా తన ముద్ర వేస్తోంది . ప్రస్తుతం దీనిపై ఎక్కువగా అమెరికా - చైనా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే, ఒక భారత్ కంపెనీ ఇప్పుడు ప్రముఖ ఏఐ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. ఇంకా చెప్పాలంటే వాటిని దాటుకుంటూ దూసుకుపోతోంది. బెంగళూరుకు చెందిన స్టార్టప్ 'సర్వం AI' భారత్ ఏఐ రంగానికి టార్చ్ బేరర్ గా ఎదుగుతోంది. ఇది భారతదేశంలో ప్రైమరీ AI నమోడల్స్ ను అభివృద్ధి చేస్తోంది.
2023 లో ప్రారంభమైన సర్వం AI అనే కంపెనీ ఇప్పుడు కొన్ని కీలక ప్రమాణాలలో గూగుల్ జెమిని - చాట్ GPT వంటి దిగ్గజ AI మోడళ్లను దాటుకుంటూ పోతోంది.. ఈ ప్రపంచ AI దిగ్గజాలకు బెంగళూరు స్టార్టప్ షాక్ ఇచ్చిందనడంలో తప్పు లేదు. ఈ స్టార్తప్ ను డాక్టర్ ప్రత్యూష్ కుమార్ - డాక్టర్ వివేక్ రాఘవన్ స్థాపించారు.
ఈ కంపెనీ తొలిసారిగా స్వదేశీ AI-శక్తితో కూడిన కళ్ళద్దాలను విడుదల చేసింది, దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ధరించి.. దాని ఫీల్ ను ఎంజాయ్ చేశారు. తరువాత ఆయన 'సర్వం KJ AI స్మార్ట్ గ్లాసెస్'. ఇది మన ముఖ సౌందర్యాన్ని పెంచే గాడ్జెట్ మాత్రమే కాదు, ఇది ప్రపంచం నుండి చిత్రాలను చూసే, వినే, అర్థం చేసుకునే, ప్రతిస్పందించే, సంగ్రహించే గాడ్జెట్ అని మెచ్చుకున్నారు.
ఇది భారతదేశంలో తయారైంది. భారతదేశంలోనే దీనిని డిజైన్ చేశారు. ఈ కళ్లద్దాలు భారతీయ AI ద్వారా పవర్ చేయబడి ఉన్నాయి. ఈ గాడ్జెట్ మే నెలలో మార్కెట్లోకి ప్రవేశిస్తుందని డాక్టర్ ప్రత్యూష్ కుమార్ అన్నారు. ప్రారంభమైన రెండు సంవత్సరాలలో ఈ స్టార్టప్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుండి, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR)లో నిర్దిష్ట బెంచ్‌మార్క్‌లలో ఇది Google జెమిని, OpenAI- ChatGPT వంటి ప్రపంచ AI హెవీవెయిట్‌లను అధిగమించింది.
ఎవరీ ప్రత్యూష్ కుమార్?
డాక్టర్ ప్రత్యూష్ కుమార్ బెంగళూరుకు చెందిన AI స్టార్టప్ సర్వం AI కి CEO. ఆయన డాక్టర్ వివేక్ రాఘవన్ తో కలిసి సర్వం AI ని స్థాపించారు. ఆయన IIT బాంబే నుండి ఇంజనీరింగ్ డిగ్రీ, ETH జ్యూరిచ్ నుండి PhDని పొందారు. ఆయన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్, IBM రీసెర్చ్, IIT మద్రాస్ లలో అనుబంధ ఫ్యాకల్టీ సభ్యుడిగా పనిచేశారు. ఆయన భారతదేశం కోసం AI4, భారతీయ భాషలకు సరసమైన ఆన్‌లైన్ అభ్యాసం కోసం PadhAI అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు.
వివేక్ రాఘవన్ గురించి..
ఐఐటీ ఢిల్లీ గ్రాడ్యుయేట్ అయిన వివేక్ రాఘవన్ విషయానికొస్తే, రాఘవన్ కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు. ఆయన సినాప్సిస్, మాగ్మా డిజైన్ ఆటోమేషన్ వంటి బహుళజాతి కంపెనీలలో సీనియర్ పదవులలో దాదాపు 20 సంవత్సరాలు ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ (EDA) రంగంలో పనిచేశారు.
సర్వం AI స్పెషాలిటీ ఇదే..
సర్వం AI పెద్ద, భారీ క్లౌడ్ మోడల్‌ల కంటే తేలికైన, వేగవంతమైన, స్థానికంగా రూపొందించిన AIని నిర్మించడంపై దృష్టి సారించింది. ఈ కంపెనీ భారతీయ భాషలు, తక్కువ ఇంటర్నెట్ వేగం, మొబైల్ వంటి ప్లాట్‌ఫామ్‌ల కోసం మోడల్‌లను అభివృద్ధి చేస్తోంది. దీని OCR, వాయిస్ సాధనాలు ప్రభుత్వ సేవలు, కాల్ సెంటర్లు, బ్యాంకింగ్, డిజిటల్ రికార్డులలో ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే టెక్ ప్రపంచంలో దీని పనిని నిశితంగా పరిశీలిస్తున్నారు.
ChatGPT, జెమిని కంటే ముందుకు ఇలా..
సర్వమ్ AI సాధనాలు, సర్వమ్ విజన్, బుల్బుల్, నిర్దిష్ట బెంచ్‌మార్క్ పరీక్షలలో బాగా పనిచేశాయి. భారతీయ భాషలకు OCR పరీక్షలలో సర్వమ్ విజన్ జెమిని, చాట్‌జిపిటి కంటే ఎక్కువ ఖచ్చితమైన ఫలితాలను ఇచ్చింది. స్థానిక భాషల్లో ఏఐ ద్వారా పనిచేయాలనుకునే వారికి చాట్ జీపీటీ, గూగుల్ జెమినీ కంటే మెరుగైన ఫలితాలను సర్వం ఏఐ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




