Galaxy Watch FE: సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ వాచ్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..!

Samsung Launching New Smart Watch Galaxy Watch FE Features and Price Details
x

Galaxy Watch FE: సామ్‌సంగ్ నుంచి స్టన్నింగ్ స్మార్ట్‌ వాచ్‌.. ఫీచర్స్‌ అదుర్స్‌ అంతే..!

Highlights

Galaxy Watch FE: ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్ వినియోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక గ్యాడ్జెట్ మాత్రమే.

Galaxy Watch FE: ప్రస్తుతం స్మార్ట్‌ వాచ్ వినియోగం అనివార్యంగా మారింది. ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక గ్యాడ్జెట్ మాత్రమే. అయితే ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ అన్నింటినీ రీప్లేస్‌ చేస్తోంది. రకరకాల ఫీచర్లతో యూజర్లను అట్రాక్ట్ చేస్తూ కంపెనీలు వాచ్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ వాచ్‌ల ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ సైతం తాజాగా ఓ మిడ్ రేంజ్‌ బడ్జెట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది.

గ్యాలక్సీ వాచ్‌ ఎఫ్‌ఈ పేరుతో ఈ వాచ్‌ను లాంచ్‌ చేశారు. ఇంతకీ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ వాచ్‌ ఎఫ్‌ఈ ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌లో అందుబాటులోకి రానుంది. ఫ్యాన్‌ ఎడిషన్‌ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ వాచ్‌ను తీసుకొచ్చారు. ఈ వాచ్‌ను బ్లాక్, సిల్వర్, పింక్ గోల్డ్‌ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ధర విషయానికొస్తే ఈ వాచ్‌ ధర రూ. 17,951గా ఉండొచ్చని అంచనా. సామ్‌సంగ్ వంటి బ్రాండ్‌ నుంచి మిడ్ రేంజ్‌ బడ్జెట్‌లో రావడం విశేషం.

ఇక ఈ వాచ్‌లో వినియోగదారులకు అధునాతన ఫీచర్లను అందించనున్నారు. ఇది సెల్యులార్ డేటా వేరియంట్‌తో వస్తుందని చెబుతున్నారు. వీటితో పాటు బ్రైట్‌నెస్ సెన్సార్, హార్ట్ రేట్ వంటి ఫీచర్లను అందించనున్నారు. ఇక సామ్‌సంగ్ గ్యాలక్సీ వాచ్‌ ఎఫ్‌ఈలో గ్యాలక్సీ వాచ్‌ 4 ఫీచర్లను పోలిన ఫీచర్లను తీసుకొచ్చే అకవాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక గ్యాలక్సీ వాచ్‌ ఎఫ్‌ఈలో 1.5 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ను అందించనున్నారు. ఈ వాచ్‌ Exynos W920 డ్యూయల్ కోర్ 1.18GHz ప్రాసెసర్‌తో పనిచేయనుంది.

అలాగే ఈ వాచ్‌లో 247mAh వంటి పవర్‌ ఫుల్ బ్యాటరీని ఇవ్వనున్నారు. దీంతో ఈ వాచ్‌ సుమారు 30 గంటల రన్‌ టైమ్‌ ఇస్తుందని కంపెనీ చెబతోంది. అలాగే ఇందులో ఈసీజీ సెన్సార్, గైరోస్కోప్, జియోమాగ్నెటిక్ సెన్సార్, బ్రైట్‌నెస్ సెన్సార్‌తో పాటు హార్ట్‌ రేట్‌, ఎస్‌పీఓ2 వంటి హెల్త్‌ ఫీచర్లను అందించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories