Samsung Galaxy S25 5G Discount: శాంసంగ్ గెలాక్సీ S25.. రూ.18000 డిస్కౌంట్..!

Samsung Galaxy S25 5G Discount: శాంసంగ్ గెలాక్సీ S25.. రూ.18000 డిస్కౌంట్..!
x

Samsung Galaxy S25 5G Discount: శాంసంగ్ గెలాక్సీ S25.. రూ.18000 డిస్కౌంట్..!

Highlights

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవారికి శాంసంగ్ గెలాక్సీ S25 5G ఇప్పుడు చాలా మంచి ధరలో దొరుకుతోంది.

Samsung Galaxy S25 5G Discount: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నవారికి శాంసంగ్ గెలాక్సీ S25 5G ఇప్పుడు చాలా మంచి ధరలో దొరుకుతోంది. శాంసంగ్ కంపెనీ త్వరలో గెలాక్సీ S26 సిరీస్ విడుదల కోసం సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దాని ముందు వెర్ష్న S25 ధరను గణనీయంగా తగ్గించింది. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ ఫోన్ భారీ తగ్గింపు ధరతో లభిస్తోంది. ఈ ఆఫర్ వల్ల కస్టమర్లు వేలాది రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ S25 5G ప్రారంభ ధర సుమారు రూ.80,000 . ప్రస్తుతం అమెజాన్‌లో దాదాపు 19 శాతం డైరెక్ట్ డిస్కౌంట్ తో లభిస్తోంది. ఈ డిస్కౌంట్ తర్వాత ఫోన్ ధర సుమారు రూ.65,988కి దిగివచ్చింది. అంటే ఒకేసారి రూ.15,000కి పైగా ఆదా చేసుకోవచ్చు. ఈ ధరతో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఇప్పుడు అత్యంత ఆకర్షణీయమైన డీల్‌గా మారింది.

అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఈ ఫోన్ కొనుగోలుపై అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే 5 శాంత ఎక్స్‌ట్రా డిస్కౌంట్ వస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్‌తో సుమారు రూ.3,299 ఆదా అవుతుంది. అన్ని ఆఫర్లు కలిపితే మొత్తం రూ.18,300 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇంత తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ దొరకడం చాలా అరుదు.

శాంసంగ్ గెలాక్సీ S25 5Gలో 6.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డి+ డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఈ స్క్రీన్ చాలా వైబ్రెంట్ కలర్స్, స్మూత్ వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ఫోన్‌లో శక్తివంతమైన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. ఇది వేగవంతమైన పనితీరు, సులభమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో శాంసంగ్ One UI 7 ఇంటర్‌ఫేస్‌లో నడుస్తుంది. ఇందులో స్మూత్ నావిగేషన్, మెరుగైన కస్టమైజేషన్ ఆప్షన్లు ఉన్నాయి.

శాంసంగ్ గెలాక్సీ S25 5Gలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా స్పష్టమైన ఫోటోలు తీస్తుంది. 10 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా ఉంది. 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా OISతో జూమ్ షాట్స్‌కు బాగా పనిచేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ బరువు కేవలం 162 గ్రాములు మాత్రమే. సన్నగా, ప్రీమియం లుక్ ఇస్తుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఓప్పో F29 ప్రో 5Gపై బలమైన ఆఫర్ ఉంది. 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.32,999. అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ తర్వాత ఇప్పుడు రూ.23,690కి దొరుకుతోంది. రూ.832 నెలకు EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి. మిడ్-రేంజ్ ఫోన్ కావాలనుకునేవారికి ఇది మంచి ఆప్షన్. శాంసంగ్ గెలాక్సీ S25 5G ఫ్లాగ్‌షిప్ ఫీచర్లను తక్కువ ధరలో అందిస్తోంది. బలమైన పనితీరు, ప్రీమియం డిజైన్, అద్భుతమైన కెమెరా క్వాలిటీ దీనికి మరింత విలువను జోడిస్తున్నాయి. ప్రస్తుత అమెజాన్ డీల్ ఈ ఫోన్‌ను తప్పకుండా పరిగణించదగిన ఎంపికగా మార్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories