Samsung Galaxy Z Fold 7 Pre-order Booking: రికార్డుల వేట.. 48 గంటల్లోనే 2.1 లక్షల ప్రీ-ఆర్డర్స్.. శాంసంగ్ ఇచ్చిపడేసింది..!

Samsung Galaxy Z Fold 7 Pre-order Booking
x

Samsung Galaxy Z Fold 7 Pre-order Booking: రికార్డుల వేట.. 48 గంటల్లోనే 2.1 లక్షల ప్రీ-ఆర్డర్స్.. శాంసంగ్ ఇచ్చిపడేసింది..!

Highlights

Samsung Galaxy Z Fold 7 Pre-order Booking: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉందని శాంసంగ్ మరోసారి నిరూపించింది. ఇటీవల విడుదలైన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, ఫ్లిప్ 7 FE లకు భారత మార్కెట్ నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది.

Samsung Galaxy Z Fold 7 Pre-order Booking: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉందని శాంసంగ్ మరోసారి నిరూపించింది. ఇటీవల విడుదలైన గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7, ఫ్లిప్ 7 FE లకు భారత మార్కెట్ నుండి అద్భుతమైన స్పందన లభిస్తోంది. కంపెనీ ప్రకారం, ఈ ఫోల్డబుల్ పరికరాలు కేవలం 48 గంటల్లోనే 2.1 లక్షల ప్రీ-ఆర్డర్‌లను అందుకున్నాయి, ఇది శామ్‌సంగ్ ఫోల్డబుల్ సిరీస్‌కు ఇప్పటివరకు అతిపెద్ద రికార్డు.

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 దాని ప్రీమియం డిజైన్, అధునాతన కెమెరా ఫీచర్లకు మాత్రమే కాకుండా, దాని AI-ఆధారిత వన్ UI 8, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 200MP కెమెరా సెటప్ దీనిని పవర్‌హౌస్ పరికరంగా మారుస్తుంది. ఈ తాజా ఫోల్డబుల్‌లో ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.


Samsung Galaxy Z Fold 7 Series Price

భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్ట్ 7 ధర రూ.1,74,999గా నిర్ణయించింది. ఇది బ్లూ షాడో, సిల్వర్ షాడో మరియు జెట్ బ్లాక్ రంగులలో లభిస్తుంది. అదే సమయంలో, Galaxy Z Flip 7 ధర రూ. 1,09,999. ఇది కోరల్ రెడ్, జెట్ బ్లాక్.బ్లూ షాడో రంగులలో వస్తుంది. రెండు ఫోన్లు ఎక్స్‌క్లూజివ్‌గా మింట్ రంగులో కూడా అందుబాటులో ఉన్నాయి.


Samsung Galaxy Z Fold 7 Pre-Booking Offers

ఈ మూడు ఫోన్లు ప్రధాన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లలో ప్రీ-బుకింగ్ కోసం అందుబాటులో ఉన్నాయి. లాంచ్ ఆఫర్లలో భాగంగా, కస్టమర్లు 256GB వేరియంట్ ధరకే 512GB వేరియంట్‌ను పొందవచ్చు. అదనంగా, మూడు పరికరాలపై 24 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక అందుబాటులో ఉంది.

Samsung Galaxy Z Fold 7 Specifications

గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 7 ఇప్పుడు గతంలో కంటే సన్నగా, తేలికగా ఫోల్డబుల్ ఫోన్. దీని బరువు కేవలం 215 గ్రాములు, మడతపెట్టిన మందం 8.9 మిమీ. ఇది 8-అంగుళాల అమోలెడ్ 2X డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్, 200MP ప్రధాన కెమెరాను కలిగి ఉంది. మరోవైపు, గెలాక్సీ Z ఫ్లిప్ 7 లో 4.1-అంగుళాల ఫ్లెక్స్‌విండో, 6.9-అంగుళాల ప్రధాన స్క్రీన్, 4,300mAh బ్యాటరీ, 188 గ్రాముల బరువు ఉంటుంది. ఫ్లిప్ 7 FE అనేది కంపెనీ మొట్టమొదటి సరసమైన FE వేరియంట్, ఇది ప్రీమియం డిజైన్, ఉపయోగకరమైన లక్షణాలను కలిగి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories