Samsung Foldable Phone: శాంసంగ్ చౌకైన ఫ్లిప్ ఫోన్‌.. త్వరలో లాంచ్.. ఫీచర్స్ లీక్..!

Samsung Foldable Phone
x

Samsung Foldable Phone: శాంసంగ్ చౌకైన ఫ్లిప్ ఫోన్‌.. త్వరలో లాంచ్.. ఫీచర్స్ లీక్..!

Highlights

Samsung Foldable Phone: శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు జూలై 9న భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి. ఈ సంవత్సరం, దక్షిణ కొరియా కంపెనీ గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 లతో పాటు చౌకైన ఫ్లిప్ ఫోన్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 SEని కూడా లాంచ్ చేయవచ్చు.

Samsung Foldable Phone: శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్లు జూలై 9న భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కానున్నాయి. ఈ సంవత్సరం, దక్షిణ కొరియా కంపెనీ గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 లతో పాటు చౌకైన ఫ్లిప్ ఫోన్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 SEని కూడా లాంచ్ చేయవచ్చు. శాంసంగ్ ఈ చౌకైన ఫోల్డబుల్ ఫోన్ అనేక సర్టిఫికేషన్ సైట్లలో కనిపించింది. ఇటీవలే ఈ చౌకైన శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ గీక్బెంచ్ లో కనిపించింది. ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫోన్ EPREL జాబితాలో కూడా కనిపించింది.

శాంసంగ్ నుండి వచ్చిన ఈ చౌకైన ఫ్లిప్ ఫోన్ KRW 1 మిలియన్ అంటే దాదాపు రూ. 62,000 ధరకు రావచ్చు. ఈ ఫోన్ కొరియన్, అమెరికన్ ధరలు ఇటీవల లీక్ అయ్యాయి. ఈ ఫోన్ 8GB RAM తో పాటు 128GB+ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ కి సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ నుండి వచ్చిన ఈ చౌకైన ఫ్లిప్ ఫోన్ ఎక్సినోస్ 2500 ప్రాసెసర్‌తో రావచ్చు. ఈ ఫోన్ లుక్ , డిజైన్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 లాగా ఉంటుంది. దీనిలో పెద్ద కవర్ స్క్రీన్ కనిపిస్తుంది.

యూరోపియన్ ప్రొడక్ట్ రిజిస్ట్రీ అండ్ ఎనర్జీ లేబులింగ్ లిస్టింగ్ ప్రకారం, గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE IP48 రేటింగ్‌ను పొందుతాయి, ఇది కంపెనీ మునుపటి మోడల్ Galaxy Z Flip 6 లో కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాల పాటు ఉండగలదు. ఈ రెండు ఫోన్లలో కంపెనీ 4,300mAh బ్యాటరీని అందిస్తుంది. అలాగే, మడతపెట్టిన తర్వాత, ఈ రెండు ఫోన్‌ల మందం 13.7మి.మీ ఉంటుంది. అదే సమయంలో మడత లేకుండా దాని మందం 6.5మి.మీ ఉంటుంది.

ఇది ఆండ్రాయిడ్ 8 ఆధారంగా OneUI 16 తో రావచ్చు. దీనికి 12GB RAM తో అందించవచ్చు. గీక్‌బెంచ్‌లో, ఇది సింగిల్ కోర్‌లో 2,012 పాయింట్లు, మల్టీ కోర్‌లో 7,563 పాయింట్లను పొందింది. ఈ చౌకైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల ప్రధాన డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనితో పాటు 3.4 అంగుళాల కవర్ స్క్రీన్ అందించారు. శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ FE లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, దీనిలో రెండు 12MP కెమెరాలు అందించారు. అదే సమయంలో, 12MP ఇన్-డిస్‌ప్లే కెమెరా కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories